అమ్మాయిని వేధించొద్దని మందలించిన యువకునిపై ప్రతీకారం తీర్చుకునే క్రమంలో కిడ్నాప్ చేసి హత్యకు ప్రయత్నించిన నలుగురు యువకులను నగర పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి 2 ద్విచక్ర వాహనాలు, ఓ చరవాణి, రూ. 4000 నగదు స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ జమాల్బండకు చెందిన అబ్దుల్ అజీజ్ నహాది శాలిబండకు చెందిన ఓ బాలికను వేధిస్తుండగా... ఇలియస్ అహ్మద్ మందలించాడు. ఇలియస్పై ప్రతీకారం తీర్చుకోవాలని భావించిన అజీజ్... స్నేహితులతో కలిసి పన్నాగం పన్ని సమయం కోసం ఎదురు చూశాడు.
ఈ నెల 14 న రాత్రి 11 గంటల సమయంలో ఇలియస్ అతని స్నేహితునితో కలిసి ద్విచక్రవాహనం మీద వెళ్లడాన్ని గమనించి వారిని అనుసరించారు. నూరి ప్యాలెస్ వద్ద కిందపడేసి ఇలియాస్‌పై దాడి చేస్తుండగా అతని స్నేహితుడు తప్పించుకుని పోలీసులకు సమాచారమిచ్చాడు. ఇలియస్ను పిలిదర్గా సమీపంలోని స్మశానవాటిక వద్దకు తీసుకెళ్లి దాడి చేశారు. అక్కడి నుంచి మల్లాపూర్‌కు తీసుకెళ్లి కట్టెలతో తీవ్రంగా కొట్టారు. అప్పటికే పోలీసులు చేరుకో.. నిందితులు పరారయ్యారు. బాధితుడు ప్రస్తుతం ఆసుపత్రిలో కోలుకుంటున్నట్లు పోలీసులు తెలిపారు.
ఇవీ చూడండి: ఈ ఇద్దరు అన్నదమ్ముల్ని కష్టాలు పగబట్టినయా