Kidnap Attempt on Girl in Old City : పదో తరగతి చదువుతున్న విద్యార్థిని ఆటో డ్రైవర్ కిడ్నాప్ చేసేందుకు యత్నించిన ఘటన సోమవారం రాత్రి హైదరాబాద్ పాతబస్తీ బండ్లగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. నిందితుడి నుంచి తప్పించుకున్న బాలిక తల్లిదండ్రులకు చెప్పింది. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు షురూ చేశారు.
బండ్లగూడ ఇన్‌స్పెక్టర్, విద్యార్థిని తండ్రి తెలిపిన వివరాల ప్రకారం : ప్రైవేటు ఉద్యోగి అయిన బాలిక తండ్రి (54) పాతబస్తీ(old city) శివారు పీలిదర్గా సమీపంలోని ఎర్రకుంట ప్రాంతంలో నివాసం ఉంటున్నారు. ఆయనకు ఐదుగురు కుమార్తెలు ఉన్నారు. నాలుగో కూతురు(16) పదో తరగతి చదువుతోంది. ప్రతి రోజూ చాంద్రాయణగుట్ట(Chandrayanagutta) పోలీస్‌స్టేషన్ వెనుక ఉన్న వీధిలో ట్యూషన్‌కు వెళ్లేది. ఎప్పటిలాగే ట్యూషన్ వెళ్లడానికి సోమవారం సాయంత్రం చాంద్రాయణగుట్టకు ఆటోలో వచ్చింది. రాత్రి 9.10 గంటల ప్రాంతంలో ట్యూషన్ పూర్తి చేసుకుని ఇంటికెళ్లేందుకు తిరుగు ప్రయాణమయ్యింది.
Auto Driver Kidnap Attempt on Student in Bandlaguda : ఇంటికెళ్లేందుకు ఆటో కోసం చాంద్రాయణగుట్ట ఠాణా వెనుక వైపున నిలబడగా ప్యాసింజర్ ఆటో వచ్చింది. అప్పటికే అందులో ఇద్దరు మహిళలు ఉన్నారు. ఎర్రకుంటకు వెళ్లేందుకు బాలిక ఆటో ఎక్కింది. అందులో ఉన్న ఇద్దరు మహిళలు బార్కస్ మలుపు వద్ద దిగారు. ఒంటరిగా ఉన్న బాలికను తీసుకొని వెళ్తున్న డ్రైవర్ అకస్మాత్తుగా ఆటోను దారి మళ్లించాడు. అనుమానం వచ్చిన బాలిక ప్రశ్నించడంతో ముఖంపై స్ప్రే చల్లాడు. కొద్దిసేపు మత్తుగా అనిపించి స్ప్పహ కోల్పోతున్నట్లు అనిపించింది. కానీ అంతలోనే స్పృహలోకి వచ్చిన బాలిక ముప్పును గుర్తించి ఆటోలోంచి బయటకు దూకేసింది. గమనించిన ఆటో డ్రైవర్ పరారయ్యాడు.
పిల్లలు లేని కుమార్తె కోసం చిన్నారిని కిడ్నాప్ చేసిన మహిళ - ఆరు గంటల్లోనే ఛేదించిన పోలీసులు
భయాందోళనకు గురైన బాలిక కాలినడకన ఇంటికి చేరింది. జరిగిన విషయమంతా తండ్రికి చెప్పింది. వెంటనే తండ్రి బాలికతో కలిసి ఠాణాకు వెళ్లి బండ్లగూడ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఎస్సై వెంకటేశ్వర్‌జీ, నైట్ డ్యూటీ ఆఫీసర్(డబీర్‌పుర ఇన్‌స్పెక్టర్) కోటేశ్వర్‌రావు దర్యాప్తు చేపట్టారు. అయితే తాను ఆటోలోంచి ఎక్కడ దూకిందో బాలిక చెప్పలేకపోతోంది. అలాగే అగంతకుడు ఆటోను ఎటువైపునకు దారి మళ్లించాడో స్పష్టంగా చెప్పలేకపోయింది. ప్రమాదం నుంచి తప్పించుకునే క్రమంలో తాను ఆటోలోంచి దూకిన చోట స్విమ్మింగ్ పూల్ కనిపించిందని పేర్కొనడంతో ముబారక్ ఫంక్షన్ హాల్ రోడ్డుపై పోలీసులు దృష్టి సారించారు.
ఇన్‌స్పెక్టర్ మహ్మద్ షాకీర్ అలీ ఆదేశాల మేరకు కిడ్నాప్ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. రాత్రి 9.42 గంటల సమయంలో బాలిక నడుచుకుంటూ ఇంటికి వస్తున్న దృశ్యాలు సమీపంలోని సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. వారు అనుమానించినట్లుగా ముబారక్ ఫంక్షన్ హాల్ రోడ్డులో ఆటో దృశ్యాలు కనిపించలేదు. చాంద్రాయణగుట్ట నుంచి బార్కస్, పీలిదర్గా రోడ్డులోని సీసీ కెమెరాలను పోలీసులు క్షుణ్నంగా పరిశీలిస్తున్నారు. డ్రైవర్ ముఖానికి మాస్కు, చేతిపై టాటూ ఉన్నట్లు బాలిక తెలిపింది.
రక్షణ కవచంలా నిలిచిన ‘నఖాబ్’.. బురఖాతో పాటు ముఖానికి ధరించిన ‘నఖాబ్’ (నోస్‌పీస్) బాధితురాలిని ఆదుకుంది. ఆటో డ్రైవర్ బాలికపై మత్తు మందు స్ప్రే చేయగా నఖాబ్ ధరించడంతో పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. కొద్దిగా కళ్లు బైర్లు కమ్మినా బాలిక వెంటనే స్ప్రహలోకి వచ్చి ఆటోలో నుంచి బయటకు దూకింది.
'అప్పులకు వడ్డీలు కట్టీకట్టీ అలసిపోయాం - మా కోసం ఎవరూ వెతకొద్దు ప్లీజ్'