Khammam Student Stabbed in US Health Update : అమెరికాలో తెలంగాణ విద్యార్థిపై ఓ దుండగుడు కత్తితో దాడి చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం లూథరన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అతడు ఇంకా కోమాలోనే ఉన్నాడని వైద్యులు తెలిపారు. లైఫ్ సపోర్టుపై ఉంచి చికిత్స అందిస్తున్నామని చెప్పారు. తీవ్రమైన నరాల బలహీనత ఏర్పడి ఎడమవైపు పాక్షిక వైకల్యం బారినపడే అవకాశం ఉన్నట్లు వైద్యులు అంటున్నారు.
America govt reacts to attack on Telangana student : మరోవైపు ఈ ఘటనపై అమెరికా(USA) తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. అతడు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించింది. భారత విద్యార్థి వరుణ్ రాజ్ పుచ్చాపై జరిగిన క్రూరమైన దాడి ఘటన నివేదికలు తీవ్రంగా కలవరపెడుతున్నాయని అమెరికా విదేశాంగ ప్రతినిధి అన్నారు. అతను సురక్షితంగా తిరిగిరావాలని ఆకాంక్షిస్తున్నామని చెప్పారు. ప్రస్తుతం దాడికి సంబంధించిన కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని పేర్కొన్నారు.
Telangana student died in America : అమెరికాలో రోడ్డు ప్రమాదం.. మహబూబ్‌నగర్ విద్యార్థి దుర్మరణం
అసలేం జరిగిందంటే.. ఇండియానా రాష్ట్రంలోని ఓ యూనివర్సిటీలో ఖమ్మం మామిళ్లగూడెం ప్రాంతానికి చెందిన పుచ్చా వరుణ్‌రాజ్ (Pucha Varunraj) ఎంఎస్ చదువుతూ పార్ట్‌టైం జాబ్ చేస్తున్నాడు. ఈ క్రమంలోనే అక్టోబర్ 31వ తేదీ జిమ్ నుంచి ఇంటికి వెళ్తుండగా ఒక దుండగుడు కత్తితో కణతపై పొడిచి దాడి చేశాడు. దీనిపై స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు వరుణ్‌ను ఆస్పత్రికి తరలించారు. అనంతరం కేసు నమోదు చేసుకుని దుండగుడిని అరెస్టు చేశారు.
KTR On Attack On Telangana Student in US : ఈ ఘటనపై బీఆర్ఎస్ కార్యనిర్వహక అధ్యక్షుడు, పురపాలక, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్(KTR) స్పందించారు. అమెరికాలోని భారతీయ రాయబార కార్యాలయం, తెలంగాణ ఎన్నారై స్నేహితుల సహాయంతో వరుణ్ రాజ్‌కు కావాల్సిన సహాయం అందిస్తామని అన్నారు. మరోవైపు తమ కుమారుడి పరిస్థితి ఎలా ఉందోనని వరుణఅ తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వరుణ్ చికిత్స, అతని తల్లిదండ్రుల అమెరికా ప్రయాణ ఖర్చుల కోసం ఉత్తర అమెరికా తెలుగు సంఘం(నాట్స్) గోఫండ్‌లో విరాళాల సేకరణ ప్రారంభించింది. బుధవారం రాత్రి వరకు 38 వేల డాలర్లు సమకూరాయి.
అమెరికాలో ఖమ్మం విద్యార్థి మృతి.. కారణం ఏంటంటే?
మరోవైపు ఇటీవలే అమెరికాలోని షికాగోలో తెలుగు విద్యార్థులపై నల్లజాతీయులు కాల్పులు జరిపిన ఘటనలో హైదరాబాద్‌కు చెందిన నందపు దేవ్‌శిష్ అనే విద్యార్థి మృతి చెందాడు. కొప్పాల సాయి చరణ్ అనే యువకుడు గాయాలపాలయ్యాడు. విశాఖపట్నానికి చెందిన లక్ష్మణ్ కాల్పుల నుంచి త్రుటిలో తప్పించుకొని ప్రాణాలు కాపాడుకున్నాడు. ఆ ముగ్గురు ఉన్నత విద్య అభ్యసించేందుకు షికాగోకు వెళ్లారు. ఇంటర్నెట్ కనెక్షన్‌కు అవసరమైన రూటర్ కొనుక్కొని తెచ్చుకునేందుకు ముగ్గురూ కలిసి సమీపంలోని వాల్‌మార్ట్ షాపింగ్ మాల్‌కు వెళ్తుండగా.. వారిని కొందరు నల్లజాతీయులు వెంబడించారు. ఒకరేమో పెద్దగన్, మరొకరు చిన్న గన్ పట్టుకుని.. సెల్‌ఫోన్లు ఇవ్వాలని వారిని బెదిరించారు. దీంతో వారు మొబైల్ ఫోన్లు, వారి వద్ద ఉన్న డబ్బులూ వారికి ఇచ్చారు. అయినా దుండగులు... వెళ్తూ వెళ్తూ వారిపై కాల్పులు జరిపారు.