ETV Bharat / state

ఖమ్మంలో బీఆర్ఎస్ బహిరంగ సభకు 5 లక్షల మంది జనం - సీఎం కేసీఆర్ వార్తలు

Khammam BRS public Meeting arrangements : ఖమ్మంలో ఈనెల 18న జరగనున్న బీఆర్ఎస్ బహిరంగ సభకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. నూతన కలెక్టరేట్ సమీపంలోని 100 ఎకరాల్లో సభ నిర్వహించేందుకు రంగం సిద్ధమైంది. 5 లక్షల మందితో సభను నిర్వహంచేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ మేరకు మంత్రి పువ్వాడ, ఎంపీలు నామ సభాస్థలిని పరిశీలించారు.

Preparations for BRS Open Meeting
Preparations for BRS Open Meeting
author img

By

Published : Jan 11, 2023, 12:34 PM IST

Khammam BRS public Meeting arrangements: దేశం దృష్టిని ఆకర్షించేలా జరగనున్న ఖమ్మం బీఆర్ఎస్ ఆవిర్భావ సభకు అధికారులు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు. మంత్రి పువ్వాడ, ఎంపీ నామ ఇవాళ సభాస్థలిని సందర్శించారు. ఈ నెల 18న ఖమ్మం వేదికగా జరగనున్న భారత్‌ రాష్ట్ర సమితి సభా ఏర్పాట్లను పార్టీ నేతలు, ప్రజా ప్రతినిధులతో కలిసి వారు పరిశీలించారు. సభకు వచ్చే వారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కల్పించాలని వసుతలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు.

చరిత్రలో నిలిచిపోయేలా ఈ సభకు వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, పార్టీల నేతలు హాజరుకానున్నట్లు మంత్రి పువ్వాడ తెలిపారు. దేశానికి దిశానిర్దేశం చేసేందుకు అడుగులు వేయనున్న కేసీఆర్‌కు మద్దతు తెలిపేలా పెద్దసంఖ్యలో ప్రజలు సభకు తరలిరావాలని కోరారు. ఈ సభకు దాదాపు 5 లక్షల మంది రానున్నట్లు వెల్లడించారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.