ETV Bharat / state

డ్రోన్ సహకారంతోనే ఖైరతాబాద్ గణేశ్ నిమజ్జనం - ఖైరతాబాద్ వినాయకుడి నిమజ్జనం

ఖైరతాబాద్ వినాయకుడు ఏటా పాక్షికంగానే నిమజ్జనమవుతున్నాడు. అయితే ఈసారి మాత్రం పూర్తిగా నిమజ్జనం చేయనున్నారు. విదేశీ సాంకేతికతను ఉపయోగించి భారీ గణనాథున్ని గంగ ఒడిలోకి చేర్చనున్నారు. ఎలాంటి ఇబ్బందులు ఎదురవ్వకుండా... డ్రోన్ సహకారంతో నిమజ్జనం పూర్తి చేయనున్నట్లు మేయర్ బొంతు రామ్మోహన్​ తెలిపారు.

నిమజ్జన సమయంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేసేందుకే డ్రోన్ల వినియోగం : మేయర్
author img

By

Published : Aug 26, 2019, 4:54 AM IST

Updated : Aug 26, 2019, 7:36 AM IST

డ్రోన్ సహకారంతోనే ఖైరతాబాద్ వినాయకుడి నిమజ్జనం చేయనున్నట్లు మేయర్ బొంతు రామ్మోహన్ తెలిపారు. ఏటా ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనం సందర్భంగా విగ్రహం పాక్షికంగానే నిమజ్జనం అవడం వల్ల ఏర్పడే ఇబ్బందులను తొలగించాలని నిర్వాహకులు చేసిన విజ్ఞప్తికి మేయర్​ స్పందించారు.

మలేషియా డ్రోన్ టెక్నాలజీ ద్వారా నిమజ్జన ప్రక్రియ సాఫీగా జరిపే విధానాన్ని రామ్మోహన్​ పరిశీలించారు. ఈ సాంకేతికతను ఉపయోగించి విగ్రహాన్ని ఎక్కడ నిమజ్జనం చేస్తే పూర్తిగా నిమజ్జనం అవుతుందనే విషయాన్ని డ్రోన్ తెలుపుతుందన్నారు. డ్రోన్ కెమెరా తన సిగ్నల్స్​ని హుస్సేన్ సాగర్​లోకి పంపడం ద్వారా కచ్చితమైన లోతు తెలుస్తుందని మేయర్ వివరించారు. దీని వల్ల విగ్రహం పూర్తిగా నిమజ్జనం అవుతుందన్నారు. లోతు తక్కువగా ఉన్న చోట బండ ఉందా... మట్టి ఉందా... అనేది పరిశీలించి మట్టి ఉన్న చోటును గుర్తించనున్నారు. అవసరమైతే విగ్రహం లోతుకు అనుగుణంగా తాత్కాలిక తవ్వకాల ద్వారా నిమజ్జనం సాఫీగా నిర్వహించొచ్చని మేయర్ స్పష్టం చేశారు.

నిమజ్జన సమయంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేసేందుకే డ్రోన్ల వినియోగం : మేయర్

ఇవీ చూడండి : దేశంలో పాలన గాడితప్పింది: మల్లు రవి

Last Updated : Aug 26, 2019, 7:36 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.