ఖైరతాబాద్ గణపతిని దర్శించుకున్న గవర్నర్ దంపతులు ఖైరతాబాద్ శ్రీ ద్వాదశాదిత్య మహాగణపతిని గవర్నర్ నరసింహన్ దంపతులు దర్శించుకున్నారు. తొలిపూజలో గవర్నర్ దంపతులతోపాటు మంత్రి తలసాని, ఎమ్మెల్యే దానం నాగేందర్ పాల్గొన్నారు. విజ్ఞాలు తొలగి.. ప్రజలకు సుఖ సంతోషాలు కలగాలని గవర్నర్ ఆకాంక్షించారు. జీవితంలో చివరిసారి అంటూ ఏదీ ఉండదని... ఖైరతాబాద్ వినాయకుడి దర్శనానికి మళ్లీ వస్తానని నరసింహన్ తెలిపారు. అలాగే ఖైరతాబాద్ మహాగణపతికి ఎమ్మెల్యే దానం నాగేందర్ 80 అడుగుల వెండి హారాన్ని సమర్పించారు. కార్యక్రమంలో పలువురు నేతలు పాల్గొన్నారు.
ఇవీ చూడండి:ఖైరతాబాద్ మహాగణపతికి దత్తన్న పూజలు