ETV Bharat / state

రుణాలపై వెంటనే శ్వేతపత్రం విడుదల చేయాలి : భట్టి

ప్రభుత్వం విపరీతంగా అప్పులు తెస్తోందని... ఇప్పటి వరకు తెచ్చిన రుణాల మీద ప్రభుత్వం వెంటనే శ్వేత పత్రం విడుదల చేయాలని సీఎల్పీ నేత భట్టి డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఉండటం రాష్ట్ర ప్రజల దౌర్భాగ్యమని ఆయన మండిపడ్డారు.

కేసీఆర్ సీఎంగా ఉండటం ప్రజల దౌర్భాగ్యం : సీఎల్పీ నేత భట్టి

author img

By

Published : Jul 16, 2020, 6:44 PM IST

ప్రభుత్వం ఇప్పటి వరకు తెచ్చిన అప్పులు, ఇంకా తేవాలనుకుంటున్న రుణాలపై శ్వేతపత్రం విడుదల చేయాలని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క డిమాండ్‌ చేశారు. గడిచిన 4 నెలలుగా రాష్ట్ర ప్రజలు భయం గుప్పిట్లో బతుకు వెల్లదీస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణకు సీఎం కేసీఆర్ ఉండటం రాష్ట్ర ప్రజల దౌర్భాగ్యమని భట్టి ధ్వజమెత్తారు. ప్రజలంతా భయంతో బతుకుతుంటే, ముఖ్యమంత్రి కేసీఆర్‌ రాష్ట్రాన్ని, ప్రజారోగ్యాన్ని గాలికి వదిలేసి ఫామ్ హౌస్‌కు వెళ్లారని దుయ్యబట్టారు.

కొత్త రుణాల కోసం..

ఇప్పుడున్న అప్పులు సరిపోవని.. మళ్ళీ కొత్త రుణాల కోసం తెచ్చిన ఆర్డినెన్స్​పై గవర్నర్ సంతకం తీసుకున్నారని మండిపడ్డారు. గడిచిన నాలుగైదు నెలల్లో మరో 30 వేలు రూ.కోట్లు అప్పులు చేశారని పేర్కొన్నారు. ఇప్పుడున్న 3 లక్షల కోట్ల అప్పును ఐదారు లక్షల కోట్ల రూపాయలకు చేరేలా రుణాలు తెచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమైందన్నారు.

చర్యలు తీసుకోవాల్సింది పోయి..

ప్రజల ప్రాణాలను తీస్తున్న కరోనా కట్టడికి మరిన్ని కఠిన చర్యలు తీసుకోవాల్సింది పోయి.. సచివాలయ కూల్చివేత సహా కొత్త ప్రాజెక్టులకు టెండర్లు పిలవడం ఏం పద్ధతని ప్రశ్నించారు. రాష్ట్రం దొరికింది కదా అని దోపిడీ చేస్తున్నారని మండిపడ్డారు. సీఎం తనయుడిగా కేటీఆర్‌ ఇంగ్లీషు మాటలు మాట్లాడటం తప్ప.. పరిపాలనలో సమర్థత కనిపించట్లేదన్నారు. ముఖ్యమంత్రి తన ధనదాహాన్ని కొంతకాలం ఆపి ప్రజల ప్రాణాలను కాపాడాలని హితవు పలికారు.

కేసీఆర్ సీఎంగా ఉండటం ప్రజల దౌర్భాగ్యం : సీఎల్పీ నేత భట్టి

ఇవీ చూడండి : పరీక్షలు పెంచండి: మంత్రి ఈటలతో కాంగ్రెస్, మజ్లిస్ ఎమ్మెల్యేలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.