రాష్ట్ర ముఖ్యమంత్రి తెలంగాణ ప్రజలకు రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఐదు ప్రగతి వసంతాలను విజయవంతంగా పూర్తి చేసుకున్నామని, ఉత్సాహంతో ఆరో వసంతంలోకి అడుగు పెడుతున్నామని చెప్పారు. దేశ చరిత్రలోనే అపూర్వ మహోద్యమాన్ని సాగించి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం ప్రగతిపథంలో పరుగులు పెడుతుందని పేర్కొన్నారు. అన్ని రంగాల్లో దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నదని సిఎం సంతోషం వ్యక్తం చేశారు. ప్రజలకు మెరుగైన సేవలు, పారదర్శవంతమైన పాలన అందించడానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తోందని వివరించారు. రాష్ట్ర అభివృద్ధిలో ప్రజలు భాగస్వాములు కావాలని సీఎం పిలుపునిచ్చారు. స్వరాష్ట్ర స్వప్నాన్ని సాకారం చేసుకోవడం కోసం తమ ప్రాణాలను త్యాగం చేసిన అమరవీరులకు ముఖ్యమంత్రి కేసీఆర్ నివాళులు అర్పించారు.
ఇవీ చూడండి: జలాశయంలో పడి ముగ్గురు మృతి