ETV Bharat / state

నేడు సాయంత్రం స్టాలిన్​తో కేసీఆర్​ భేటీ

ఫెడరల్​ ఫ్రంట్​ ఏర్పాటే ధ్యేయంగా సీఎం కేసీఆర్ ప్రయత్నాలు ముమ్మరం చేశారు. గత వారం కేరళ వెళ్లి పినరయ్​ విజయన్​తో చర్చలు జరిపిన గులాబీ అధినేత నేడు తమిళనాడు విపక్ష నేత, డీఎంకే  అధ్యక్షుడు స్టాలిన్​తో భేటీ కానున్నారు. నిన్న సాయంత్రం కుటుంబ సమేతంగా తమిళనాడు బయల్దేరి వెళ్లారు.

author img

By

Published : May 13, 2019, 5:00 AM IST

కేసీఆర్​తో స్టాలన్​(ఫైల్​)
నేడు సాయంత్రం స్టాలిన్​తో కేసీఆర్​ భేటీ

సమాఖ్య కూటమి ఏర్పాటుకు గులాబీ అధినేత కేసీఆర్​ ప్రాంతీయ పార్టీలతో చర్చలు కొనసాగిస్తున్నారు. గతంలో నవీన్​ పట్నాయక్​, మమత బెనర్జీతో చర్చలు జరిపిన కేసీఆర్​ పోయిన వారం కేరళ వెళ్లి పినరయ్​ విజయన్​ను కలిశారు. నేడు డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్​తో సమావేశం కానున్నారు. నిన్న సాయంత్రం కేసీఆర్​ కుటుంబ సమేతంగా ప్రత్యేక విమానంలో తమిళనాడు బయల్దేరారు.

ఆసక్తిని రేకెత్తిస్తున్న కేసీఆర్​ పర్యటనలు

ఇవాళ ఉదయం కేసీఆర్​ శ్రీరంగం, తిరుచ్చిలోని ఆలయాలను సందర్శిస్తారు. సాయంత్రం 4.30 గంటలకు స్టాలిన్​తో భేటి అవుతారు. సీఎం గతేడాది కరుణానిధితో పాటు స్టాలిన్​ను​ కలిశారు. లోక్​సభ ఫలితాలకు 10 రోజుల గడవు ఉన్న సమయంలో కేసీఆర్​ పర్యటనలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. కేంద్రంలో కాంగ్రెస్​, భాజపాలకు ప్రత్యమ్నాయంగా సమాఖ్య కూటమిని సీఎం ప్రతిపాదిస్తుండగా కొన్ని పార్టీలు మద్దతు ఇస్తుండగా...మరికొన్ని ఆచితూచి వ్యవహరిస్తున్నాయి.

ఇవీ చూడండి: సత్తాచాటారు.. అవార్డులు దక్కించుకున్నారు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.