ETV Bharat / state

'కేసీఆర్.. మద్యపాన నిషేధం అమలు చేస్తారా?'

జోగులాంబ గద్వాల జిల్లా సాధన కోసం తాను రెండు రోజులు నిరాహార దీక్ష చేపడితే ప్రత్యేక జిల్లా సాధ్యం కాదన్నారు. కానీ దాన్ని సాధ్యం చేసి చూపించానని వ్యాఖ్యానించారు మాజీ మంత్రి, భాజపా నాయకురాలు డీకే అరుణ. మద్యం అమ్మకాలు నియంత్రించాలంటూ.. రేపు ఇందిరాపార్కు వద్ద మహిళా సంకల్ప దీక్ష చేపట్టనున్నట్లు తెలిపారు.

KCR
కేసీఆర్
author img

By

Published : Dec 11, 2019, 5:16 PM IST

Updated : Dec 11, 2019, 6:26 PM IST

విచ్చలవిడి మద్యం అమ్మకాల వల్లే రాష్ట్రంలో అత్యాచార ఘటనలు జరుగుతున్నాయని భాజపా నాయకురాలు, మాజీ మంత్రి డీకే అరుణ అన్నారు. రేపు ఇందిరాపార్కు వద్ద మహిళా సంకల్ప దీక్ష చేపడుతున్నట్లు ఆమె వివరించారు. మద్యం అమ్మకాలను నియంత్రించడానికే దీక్షని పేర్కొన్నారు. రేపటి దీక్షపై మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్ఠిగా అరుణ మాట్లాడారు.

సీఎం అమలు చేస్తారా?

ఒక్క రోజులో మార్పు తీసుకురాలేమని... మద్యం నిషేధం కోసం భాజపా మహిళా సంకల్ప దీక్ష పేరిట తాను రెండు రోజులు నిరాహార దీక్షకు పూనుకున్నట్లు వివరించారు. తెలంగాణలో మద్యం వల్లనే ఎక్కువ ఆదాయం వస్తోందని... అలాంటప్పుడు సీఎం కేసీఆర్ మద్యపాన నిషేధం అమలు చేస్తారా అని అందరూ అనుమానం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు.

సాధ్యం కాదన్నారు.. చేసి చూపెట్టా..

సీఎం కేసీఆర్ తనకి నచ్చిన విషయాల్లో మాత్రమే పక్క రాష్ట్రాలతో పోల్చుకుంటారని విమర్శించారు. తాను చేపట్టనున్న దీక్షలో పార్టీలోని ముఖ్యులందరూ పాల్గొంటారని అరుణ వివరించారు. మద్యపాన నిషేధాన్ని అమలు చేసేలా భాజపా అడుగులు వేస్తోందన్నారు. గద్వాల జిల్లా కోసం రెండు రోజులు దీక్ష చేస్తే సాధ్యంకాదన్నారని... సాధించి చూపెట్టానని పేర్కొన్నారు. ఆర్టీసీ సమ్మె విషయంలో కేంద్ర ప్రభుత్వ ఒత్తిడిని గ్రహించే కేసీఆర్ తగ్గారని చెప్పారు.

ఇదీ చూడండి : సంక్షేమ బోర్డు.. సరకుల రవాణా.. బస్సుల తగ్గింపు!

TG_Hyd_27_11_BJP_DK_Aruna_Chit_Chat_AV_3182061 Reporter: Jyothi Kiran Script: Razaq Note : డీకే అరుణ ఫైల్ విజువల్స్ వాడుకోగలరు. ( ) విచ్చలవిడిగా మద్యం అమ్మకాల వల్లనే దిశ, మానస,టేకు లక్ష్మీ సంఘటనలు జరిగాయని భాజపా నాయకురాలు మాజీ మంత్రి డీకే అరుణ అన్నారు. మద్యం అమ్మకాలను నియంత్రించడానికే దీక్ష చేపడుతున్నట్లు ఆమె పేర్కొన్నారు. రేపు ఇందిరాపార్కు వద్ద మహిళ సంకల్ప దీక్ష చేపట్టినట్లు డీకే అరుణ వెల్లడించారు. హైదరాబాద్‌లో ఆమె మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. ఒక్క రోజులో మార్పు తీసుకురాలేమని...మద్య నిషేదం కోసం భాజపా మహిళా సంకల్ప దీక్ష పేరిట తాను రెండు రోజులు నిరాహార దీక్షకు పూనుకున్నట్లు చెప్పారు. తెలంగాణలో మద్యం వల్లనే ఎక్కువ ఆదాయం వస్తుందని... అలాంటప్పుడు సీఎం కేసీఆర్ మద్యపాన నిషేదం అమలు చేస్తారా అని అందరూ అనుమానం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. మద్యం అమ్మకాలను రెండింతలు చేసిన సీఎం కేసీఆర్....మద్యాన్ని కేవలం ఆదాయ వనరుగా చూస్తున్నారని దుయ్యబట్టారు. సీఎం కేసీఆర్ తనకీ నచ్చిన విషయాల్లో మాత్రమే పక్క రాష్ట్రాలతో పోల్చుకుంటారని విమర్శించారు. తాను చేపట్టిన దీక్షలో పార్టీలోని ముఖ్యులందరూ అందరూ పాల్గొంటారని అరుణ వివరించారు. మద్య నిషేదాన్ని అమలు చేసేలా భాజపా అడుగులు వేస్తోందన్నారు. గద్వాల జిల్లా కోసం రెండు రోజులు దీక్ష చేస్తే సాధ్యంకాదన్నారని... సాధించి చూపెట్టానని పేర్కొన్నారు. ఆర్టీసీ సమ్మె విషయంలో కేంద్ర ప్రభుత్వ ఒత్తిడిని గ్రహించి కేసీఆర్ తగ్గారని చెప్పారు.
Last Updated : Dec 11, 2019, 6:26 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.