ETV Bharat / state

ప్రభుత్వ విధానాలతోనే ఆరోగ్య తెలంగాణ సాధ్యమైంది : సీఎం కేసీఆర్​

KCR Comments on Telangana Health sector : ప్రజారోగ్య పరిరక్షణ, వైద్యారోగ్యరంగ అభివృద్ధి దిశగా ప్రభుత్వం చేపట్టిన చర్యలతో రాష్ట్రం ఆరోగ్య తెలంగాణగా అవతరించిందని ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రజలంతా ఆయురారోగ్యాలతో జీవించాలని ఆయన ఆకాంక్షించారు.

KCR
KCR
author img

By

Published : Apr 7, 2023, 8:33 AM IST

Updated : Apr 7, 2023, 10:08 AM IST

KCR Comments on Telangana Health sector : వైద్య ఆరోగ్య రంగంలో తెలంగాణ సాధించిన ప్రగతి దేశానికే ఆదర్శమని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. ప్రజారోగ్య పరిరక్షణ, వైద్య ఆరోగ్య రంగంలో అభివృద్ధి దిశగా ప్రభుత్వం చేపట్టిన చర్యలతో రాష్ట్రం ఆరోగ్య తెలంగాణగా అవతరించిందని సీఎం తెలిపారు. ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రజలంతా ఆయురారోగ్యాలతో జీవించాలని ఆయన ఆకాంక్షించారు.

KCR on World Health Day : హైదరాబాద్, వరంగల్ వంటి ముఖ్య పట్టణాల్లో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల నిర్మాణంతో.. కార్పొరేట్ స్థాయిలో ప్రభుత్వ వైద్యం అందించేందుకు కృషి చేస్తున్నామని కేసీఆర్ చెప్పారు. నిమ్స్‌ ఆస్పత్రిని 2వేల 500 పడకలతో విస్తరిస్తున్నట్లు వివరించారు. కేంద్రం ప్రకటించిన అన్ని ఆరోగ్య సూచికల్లో.. జాతీయ స్థాయి కంటే తెలంగాణ మెరుగ్గా ఉండడం స్వరాష్ట్రంగా తెలంగాణ సాధించిన ఘనతగా కేసీఆర్‌ అభివర్ణించారు.

Super Specialty Hospitals in Telangana : రాష్ట్రంలో కొత్తగా నాలుగు సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులు నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తోన్న వరంగల్​ సూపర్​ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణ దశలో ఉంది. 2వేల పడకల సదుపాయం కల్గిన ఈ ఆసుపత్రి.. 24 అంతస్తులు ఉండనున్నాయి. నిర్మాణం పూర్తియితే త్వరలోనే ప్రారంభోత్సవం కానుంది. మరో మూడూ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులు నిర్మాణ దశలో ఉన్నాయి. పేదలకు కార్పొరేటర్ తరహా వైద్యం అందించడమే లక్ష్యంగా ఈ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులు నిర్మిస్తున్నట్లు గతంలోనే సీఎం కేసీఆర్ చెప్పిన విషయం తెలిసిందే.

Kanti Velam program in Telangana: మరోవైపు అంధత్వ నిర్మూలనే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన కంటి వెలుగు రెండో దశ కార్యక్రమం దిగ్విజయంగా సాగుతోంది. గురువారానికి కంటి వెలుగు పరీక్షలు కోటి మార్కును దాటినట్టు వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. కేవలం 50రోజుల్లోనే కోటి మందికి పైగా పరీక్షలు పూర్తి చేసినట్లు తెలిపింది. దీంతో అర్హులైన వారిలో 64.07 శాతం మందికి ఇప్పటి వరకు పరీక్షలు పూర్తి చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు మొత్తం 7వేల గ్రామ పంచాయితీలలో.. 2వేల 339 వార్డుల్లో కంటి పరీక్షలు పూర్తి చేసినట్టు ఆరోగ్య శాఖ నివేదికలో పేర్కొంది. మరో 946 గ్రామ పంచాయితీలు, 475 వార్డుల్లో పరీక్షలు కొనసాగుతునట్లు స్ఫష్టం చేసింది. ఇప్పటి వరకు పరీక్షలు చేయించుకున్న వారిలో అత్యధిక శాతం మహిళలే కావటం గమనార్హం.

ఇవీ చదవండి:

BRS Protests in Telangana : ఈనెల 8న సింగరేణిలో మహాధర్నాలు

సాగర తీరాన రాజ్యాంగ నిర్మాత రాజసం.. ఆవిష్కరణకు సిద్ధం

'కూల్‌ రూఫ్‌' అమలులో ప్రజలందరూ భాగస్వామ్యం కావాలి: కేటీఆర్

రేపు హైదరాబాద్​కు ప్రధాని నరేంద్ర మోదీ.. ఏర్పాట్లలో బీజేపీ నేతలు బిజీబిజీ

Last Updated : Apr 7, 2023, 10:08 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.