సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు బాధ్యతగా పనిచేయాలని సీఎం కోరారు. మంచినీరు, విద్యుత్ సరఫరా, రహదారుల నిర్మాణం లాంటి ముఖ్యమైన పనులన్నీ ప్రభుత్వమే నేరుగా చేస్తున్నందున గ్రామాల్లో పచ్చదనం పెంచడం, పరిశుభ్రత పాటించడం, వైకుంఠధామాల నిర్మాణంపై దృష్టి పెట్టాలని సూచించారు.
గ్రామ పంచాయతీలకు అవసరమైన నిధులు, విధులు కేటాయిస్తామన్నారు. నిధుల దుర్వినియోగానికి పాల్పడినా, విధి నిర్వహణలో నిర్లక్ష్యం వ్యవహరించినా... పదవుల నుంచి తొలగించే విధంగా చట్టాన్ని రూపొందించామని స్పష్టం చేశారు.
గ్రామాల వికాసానికి అంకితభావంతో పనిచేసేందుకు సర్పంచులకు కావాల్సిన అవగాహనను, చైతన్యాన్ని రిసోర్స్ పర్సన్స్ కలిగించాలని కేసీఆర్ కోరారు.