ETV Bharat / state

TRS BHAVAN IN DELHI: దిల్లీలో తెరాస భవన్.. ఇవాళ శంకుస్థాపన.. హస్తినలోనే గులాబీ దళం!

దిల్లీలో తెలంగాణ రాష్ట్రసమితి కార్యాలయం శంకుస్థాపనకు సర్వం సిద్ధమైంది. పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్​ ఇవాళ భూమి పూజ చేయనున్నారు. దిల్లీలో పార్టీ భవనం ఓ మైలురాయిగా.. భవిష్యత్‌ రాజకీయాలకు నాందిగా తెరాస శ్రేణులు అభివర్ణిస్తున్నాయి. ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా జెండా పండగకు పార్టీ శ్రేణులు సిద్ధమయ్యాయి. సంస్థాగత పునర్నిర్మాణం కూడా మొదలు కానుంది.

author img

By

Published : Sep 2, 2021, 2:47 AM IST

Updated : Sep 2, 2021, 6:35 AM IST

kcr-to-lay-stone-for-trs-office-in-delhi-today

దేశ రాజధానిలో తెరాస కార్యాలయం భూమి పూజకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. తెరాస అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు మధ్యాహ్నం 1.48గంటలకు భూమిపూజ చేయనున్నారు. సీఎం కేసీఆర్, పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, రాష్ట్ర కమిటీ సభ్యులు, ఇతర నేతలు ఇప్పటికే దిల్లీలో ఉన్నారు. గతేడాది అక్టోబరు 9న దిల్లీ వసంత విహార్ వద్ద కేంద్ర ప్రభుత్వం తెరాసకు 1100 చదరపు మీటర్ల భూమిని కేటాయించింది. భూమికి ఎకరానికి 25 కోట్ల రూపాయలు చెల్లించడంతో పాటు.. ఏడాదికి రెండున్నర శాతం అద్దెను రెండు విడతలుగా చెల్లించాలని ఒప్పందం. గతేడాది నవంబరు 4న తెరాసకు కేంద్రం భూమిని అప్పగించింది.

ఏడాదిలోగా నిర్మాణం పూర్తి చేసేలా..

నేడు మంచి ముహూర్తంగా భావించి భూమి పూజ చేసేందుకు గులాబీ పార్టీ ఏర్పాట్లు చేసింది. ఏడాది లోగా పార్టీ కార్యాలయ భవనం నిర్మాణం పూర్తి చేసేలా ప్రణాళికలు చేశారు. తెలంగాణ చరిత్ర, సంస్కృతిని ప్రతిబింబించేలా పార్టీ కార్యాలయం నిర్మిస్తామని తెరాస చెబుతోంది. రెండు దశాబ్దాలు పూర్తి చేసుకున్న గులాబీ పార్టీ... దిల్లీలో పార్టీ కార్యాలయం నిర్మాణం కీలక మైలురాయిగా భావిస్తోంది. దిల్లీ కేంద్రంగా భవిష్యత్తు రాజకీయాలకు ఇది నాందిగా తెరాస శ్రేణులు అభివర్ణిస్తున్నాయి. ఓ ప్రాంతీయ పార్టీ దిల్లీలో కార్యాలయ భవనం ప్రారంభించడం గర్వకారణమని.. అరుదని పార్టీ నేతలు విశ్లేషిస్తున్నారు.

ఇవాళే శ్రీకారం

ఓ వైపు దిల్లీ కార్యాలయానికి భూమి పూజ చేయనుండగా... మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా పార్టీ జెండా పండగ జరిపేందుకు తెరాస శ్రేణులు సిద్ధమయ్యాయి. గ్రామాలు, పట్టణాల్లోని వార్డుల వారీగా నేడు తెరాస శ్రేణులు పార్టీ జెండా ఎగరవేయనున్నారు. పార్టీ సంస్థాగత పునర్నిర్మాణ ప్రక్రియకు కూడా ఇవాళే శ్రీకారం చుట్టనున్నారు. జెండా పండగ, సంస్థాగత నిర్మాణంపై కేసీఆర్, కేటీఆర్ ఇప్పటికే పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. జెండా పండగ పూర్తి కాగానే.. గ్రామ, వార్డు కమిటీల నిర్మాణం మొదలు కానుంది. కమిటీల్లోఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు 51శాతం ఉండాలని కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. మహిళలకు తగిన స్థానం కల్పించాలని కేటీఆర్ స్పష్టం చేశారు.

కమిటీలు ఏర్పాటు చేసేలా షెడ్యూలు

నేటి నుంచి ఈనెల 12 వరకు గ్రామ, వార్డు కమిటీలు ఏర్పాటు చేసేలా తెరాస షెడ్యూలు రూపొందించింది. ఈనెల 12 నుంచి 20 వరకు మండల, పట్టణ కమిటీల నిర్మాణం చేపడతారు. సంస్థాగత నిర్మాణంలో ఈ ఏడాది మార్పులను చేసింది. మళ్లీ జిల్లా కమిటీలను పునరుద్ధరించాలని నిర్ణయించింది. ఈనెల 20 తర్వాత జిల్లా అధ్యక్షుడు, కార్యవర్గాలను కేసీఆర్ ప్రకటించనున్నారు. తెరాస అనుబంధ కమిటీలను కూడా ఈనెలలోనే ఏర్పాటు చేయనున్నారు. గతంలో లేని విధంగా గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు సోషల్ మీడియా కమిటీలను కూడా ఏర్పాటు చేయాలని గులాబీ పార్టీ నిర్ణయించింది. హైదరాబాద్​లో డివిజన్ కమిటీలతో.. మురికివాడల్లో బస్తీ కమిటీలు కూడా ఏర్పాటు చేయనున్నారు. హైదరాబాద్​లో సంస్థాగత నిర్మాణంపై ప్రత్యేక దృష్టి సారించిన తెరాస.. అయిదారు రోజుల్లో నగర మంత్రులు, ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లతో కేటీఆర్ సమావేశం కానున్నారు. కమిటీల పునర్నిర్మాణం పూర్తయ్యాక.. జిల్లాల్లో పార్టీ కార్యాలయాల ప్రారంభించనున్నారు. అక్టోబరు చివర్లో లేదా నవంబరు మొదటి వారంలో తెరాస ద్విశతాబ్ది ఉత్సవాలను ఘనంగా జరపాలని పార్టీ నాయకత్వం భావిస్తోంది.

రేపు ప్రధానిని సీఎం కేసీఆర్‌ కలిసే అవకాశం

దిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్‌ శుక్రవారం ప్రధానమంత్రి నరేంద్రమోదీని కలవాలని భావిస్తున్నారు. ఈ మేరకు సీఎం కార్యాలయం ప్రధాని కార్యాలయం నుంచి అపాయింట్‌మెంట్‌ కోరింది. అనుమతి లభిస్తే ప్రధాని వద్దకు సీఎం వెళతారు. కేంద్ర హోంమంత్రి అమిత్‌షా, జల్‌శక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్‌ షెకావత్‌లతోనూ భేటీ కోరుతూ వారి కార్యాలయాలకు సమాచారం పంపించారు. వారు అంగీకరిస్తే సమావేశమవుతారు. సీఎం చివరిసారిగా 2020 డిసెంబరు 12న ప్రధాని, హోంమంత్రిలను కలిశారు. ఆ తర్వాత దిల్లీకి వెళ్లడం ఇదే మొదటిసారి. శుక్రవారం ప్రధానిని కలిసే అవకాశం లభిస్తే సీఎం... కృష్ణా, గోదావరి యాజమాన్య బోర్డుల పరిధిపై ఇటీవల కేంద్రం జారీ చేసిన గెజిట్‌పై అభ్యంతరాలను తెలియజేసి, తెలంగాణ వాటాల గురించి వివరించనున్నట్లు తెలుస్తోంది. కేంద్రంలో పెండింగులో ఉన్న వివిధ అంశాలను ఆయన దృష్టికి తీసుకెళ్లనున్నారు. తెలంగాణలో దళితబంధు పథకం సంకల్పం, అమలుతీరు, మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహారావుకు భారతరత్న పురస్కారం, పార్లమెంటులో ఆయన చిత్రపటం వంటి అంశాలను ప్రస్తావించనున్నట్లు సమాచారం. అలాగే హైదరాబాద్‌లో ఔషధనగరి శంకుస్థాపనకు కేసీఆర్‌ ప్రధాని మోదీని ఆహ్వానించనున్నారు. ప్రధానితో భేటీ కోసం ఇప్పటికే ముఖ్యమంత్రి కార్యాలయం.. దిల్లీలో కేంద్రం వద్ద పెండింగులో ఉన్న 52 అంశాలకు సంబంధించిన నివేదికను రూపొందించి సీఎంకు అందజేసింది.

ఇదీ చదవండి: CM KCR DELHI TOUR: దిల్లీకి చేరుకున్న కేసీఆర్​.. రెండు రోజుల పాటు బిజీబిజీ!

Last Updated : Sep 2, 2021, 6:35 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.