ETV Bharat / state

కేసీఆర్ మరోసారి ఆలోచించు : వీహెచ్ - NO COUNCIL

ప్రభుత్వం కొత్తగా నిర్మించనున్న సచివాలయం , అసెంబ్లీ నిర్మాణంపై నిర్ణయం మార్చుకోవాలని సీఎం కేసీఆర్​కు కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు సూచించారు. ప్రజా పాలన గాలికొదిలేసి భవన నిర్మాణాలపై దృష్టి పెట్టడం ఎంత వరకు సబబని ప్రశ్నించారు.

ప్రజల అభీష్టం మేరకు వారసత్వ భవనాల్లోనే అసెంబ్లీ, కౌన్సిల్​లు నిర్వహించాలి : వీహెచ్
author img

By

Published : Jul 7, 2019, 8:23 PM IST

రాష్ట్రంలో ఇప్పటికే సచివాలయం, అసెంబ్లీ ఉండగా మళ్లీ నూతనంగా ఎందుకు నిర్మిస్తున్నారంటూ కాంగ్రెస్ నేత వీహెచ్ ప్రభుత్వంపై మండిపడ్డారు. ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని కేసీఆర్​పై ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోసారి ఆలోచించి ఈ నిర్ణయాన్ని విరమించుకోవాలని సూచించారు. గతంలో నిర్వహించినట్లే ఈ సారి బ్యాలెట్ పద్ధతిలో ప్రజా అభిప్రాయ స్వీకరణ కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. ప్రజల అభీష్టం మేరకు వారసత్వ భవనాల్లోనే అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ ప్రజల రిజర్వేషన్లను అగ్రకులాల వారే అనుభవిస్తున్నారన్నారు. క్రిమిలేయర్ విధానాన్ని ఎత్తివేయాలని కేంద్రాన్ని కోరారు.

సచివాలయ, అసెంబ్లీ భవన నిర్మాణాలపై కేసీఆర్ నిర్ణయం మార్చుకోవాలి : వీహెచ్

ఇవీ చూడండి : తెలుగు రాష్ట్రాల్లో భాజపా ప్రకంపనలు: కిషన్ రెడ్డి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.