CM KCR about BR Ambedkar : సామాజిక అసమానతలను రూపుమాపేందుకు డాక్టర్ బీ.ఆర్.అంబేడ్కర్ జీవితమంతా పోరాడారని సీఎం కేసీఆర్ అన్నారు. అన్ని వర్గాలకు సమన్యాయం జరగాలన్న దార్శనికతతోనే రాజ్యాంగాన్ని రూపొందించారని కొనియాడారు. ఇవాళ అంబేడ్కర్ వర్ధంతి సందర్భంగా ఆయన సేవలను కేసీఆర్ గుర్తు చేసుకున్నారు. ప్రతి మనిషి ఆత్మగౌరవంతో జీవించాలని బీఆర్ అంబేడ్కర్ ఆకాక్షించారని సీఎం అన్నారు. అదే స్ఫూర్తితో రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తున్నట్లు చెప్పారు.
దళితబంధు పథకానికి ప్రేరణ, స్ఫూర్తి అంబేడ్కర్ మహాశయుడేనని స్పష్టం చేశారు. కొత్త సచివాలయానికి అంబేడ్కర్ పేరు పెట్టామన్నారు. దేశంలోనే అతిపెద్దదైన 125 అడుగుల విగ్రహాన్ని హైదరాబాద్లో ప్రతిష్ఠించనున్నట్లు తెలిపారు. అంబేద్కర్ తాను అనుభవించిన సామాజిక వివక్షను సవాల్ గా తీసుకుని విజయం సాధించి విశ్వమానవ సౌభ్రాతృత్వానికి దిక్సూచిగా నిలిచి ప్రపంచ మేధావిగా ఎదిగారని గుర్తు చేశారు.
రాజ్యాంగంలో ఆర్టికల్ 3 ద్వారా తెలంగాణ ఏర్పాటుకు కారణమైన అంబేడ్కర్ గొప్పతనాన్ని విశ్వానికి చాటే దిశగా తెలంగాణ ప్రభుత్వం కార్యాచరణ చేపట్టిందని కేసీఆర్ తెలిపారు. అంబేడ్కర్ ఆశయాలు, విలువలను అనుసరిస్తూ, దళిత బహుజన పేద వర్గాల అభ్యున్నతికి పాటుపడటమే ఆ మహానుభావునికి ఇచ్చే అసలైన నివాళి అని.. అదే దిశగా రాష్ట్ర ప్రభుత్వం పాలన సాగిస్తున్నదని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.
ఇవీ చదవండి: