ETV Bharat / state

రాష్ట్ర బడ్జెట్ పరిమాణం పెరిగే అవకాశముందన్న కేసీఆర్‌

రాష్ట్ర బడ్జెట్ పరిమాణం పెరిగే అవకాశాలున్నాయని, ఆశాజనకంగా ఉంటుందని సీఎం కేసీఆర్​ తెలిపారు. కరోనా ప్రభావం రాష్ట్రంపై లక్ష కోట్ల వరకూ పడిందన్న సీఎం... తదనంతర పరిణామాల్లో ఆర్థిక కార్యకలాపాలు పెరిగి రాబడి పుంజుకుందని చెప్పారు. మరో మూడు లక్షల గొర్రెల యూనిట్ల పంపిణీ కోసం బడ్జెట్​లో ప్రతిపాదనలు ఉంటాయన్న ముఖ్యమంత్రి... చేపల పెంపకం కార్యక్రమాన్ని కూడా కొనసాగిస్తామని తెలిపారు.

KCR‌ said the telangana state budget 2021-22 maybe increase
రాష్ట్ర బడ్జెట్ పరిమాణం పెరిగే అవకాశముందన్న కేసీఆర్‌
author img

By

Published : Mar 7, 2021, 5:07 AM IST

రానున్న ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర వార్షిక పద్దు, బడ్జెట్ సమావేశాల నిర్వహణపై ముఖ్యమంత్రి కేసీఆర్​ సమీక్ష నిర్వహించారు. ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు, ఉన్నతాధికారులతో సీఎం ఐదు గంటల పాటు సమావేశమయ్యారు. వార్షికపద్దులో పొందుపరచాల్సిన శాఖల వారీ బడ్జెట్ అంచనాలు, అధికారులు అందించిన నివేదికలను పరిశీలించారు.

రాబడి పెరిగింది

కరోనా ప్రభావం వల్ల రాష్ట్ర ఖజానాకు దాదాపు 50 వేల కోట్ల రూపాయల మేర నష్టం వాటిల్లిందని... ఆ ప్రభావం లక్ష కోట్ల వరకు చేరుకుందని సీఎం తెలిపారు. అయితే తదనంతర పరిస్థితుల్లో రాష్ట్రంలో ఆర్థిక కార్యకలాపాలు పుంజుకున్నాయని, వివిధ రూపాల్లో రాబడి పెరిగిందని వివరించారు. దీంతో ప్రస్తుత బడ్జెట్ కంటే రాబోయే ఆర్థిక సంవత్సర బడ్జెట్‌లో కేటాయింపులు ఎక్కువగానే వుండే ఆస్కారముందని ముఖ్యమంత్రి తెలిపారు. 2021-22 వార్షిక సంవత్సరానికి రాష్ట్ర బడ్జెట్ ఆశాజనకంగా ఉండబోతుందని కేసీఆర్​ సూచనప్రాయంగా తెలిపారు.

గొర్రెల పంపిణీ

సంక్షేమ, అభివృద్ది పథకాల అమలుతోపాటు ఇప్పటికే అమల్లో ఉన్న గొర్రెల పంపిణీ, చేపల పెంపకం కార్యక్రమాలను కొనసాగిస్తామని చెప్పారు. గొర్రెల పంపిణీ ద్వారా గొల్ల కురుమల కుటుంబాలు ఆదాయాన్ని ఆర్జిస్తున్నాయని... కేంద్ర ప్రభుత్వం కూడా ఈ పథకాన్ని ప్రశంసించిందని ముఖ్యమంత్రి గుర్తు చేశారు. దేశంలోనే అత్యంత ఎక్కువగా గొర్రెల సంఖ్య ఉన్న రాష్ట్రంగా తెలంగాణ పురోగమిస్తోందని కేంద్రం గుర్తించిందని సీఎం చెప్పారు. ఇప్పటికే పంపిణీ చేసిన మూడు లక్షలా 70 వేల యూనిట్లకు కొనసాగింపుగా... మరో మూడు లక్షల గొర్రెల యూనిట్ల పంపిణీ కోసం బడ్జెట్​లో ప్రతిపాదనలు పొందుపరుస్తామని తెలిపారు.

తుది మెరుగులు

గొప్పగా సాగుతున్న చేపల పెంపకం కార్యక్రమం ద్వారా మంచి ఫలితాలు వస్తున్నందున దానినీ కొనసాగిస్తామని సీఎం తెలిపారు. బడ్జెట్ అంచనాలు, కేటాయింపుల కోసం సమీక్షలో విధివిధానాలు ఖరారు చేశారు. ఆర్ అండ్ బీ, పంచాయతీరాజ్, పురపాలక, విద్య, నీటిపారుదల తదితర శాఖలతో ఆర్థిక మంత్రి హరీశ్ రావు బడ్జెట్ సమీక్షలు నిర్వహించనున్నారు. అన్ని శాఖలతో కసరత్తు పూర్తయ్యాక ముఖ్యమంత్రి కేసీఆర్​ బడ్జెట్‌కు తుది మెరుగులు దిద్దనున్నారు. బడ్జెట్ సమావేశాలు ఈ నెల మధ్యలోనే ప్రారంభమయ్యే అవకాశాలున్నాయని సీఎం తెలిపారు.

ఇదీ చూడండి : విద్యాశాఖలో పలువురు ఉద్యోగుల ట్రాన్స్​ఫర్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.