ఉస్మానియా ఆస్పత్రి చారిత్రక వారసత్వ భవనమని... కానీ ఇప్పుడున్న స్థలంలోనే కొత్త ఆస్పత్రి నిర్మించాలని కొందరు కోరుతున్నారని ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీలో తెలిపారు. అక్కడే నూతన భవనం నిర్మించడానికి కొన్ని హెరిటేజ్ నిబంధనలు ఉన్నాయని తెలిపారు. రాష్ట్రంలోని చారిత్రక కట్టడాలను కాపాడాలని కొత్త చట్టం తీసుకొచ్చినట్లు సీఎం సభ దృష్టికి తీసుకొచ్చారు. అది జీవో అనుకొని కొందరు హైకోర్టులో వాదనలు చేస్తున్నారని వ్యాఖ్యానించారు. ప్రతి భవనాన్ని చారిత్రక భవనం అంటూ కొందరు వితండవాదం చేస్తున్నారని పేర్కొన్నారు. దిల్‌కుషా అతిథిగృహాన్ని కూడా చారిత్రక భవనం అంటే ఎలా? అని కేసీఆర్ ప్రశ్నించారు.
ఇవీ చూడండి:అసెంబ్లీలో కొత్త పురపాలక బిల్లు ప్రవేశపెట్టిన సీఎం కేసీఆర్