ETV Bharat / state

Telangana Brahman Sadan : ఈ నెల 31న తెలంగాణ బ్రహ్మణ్ సదన్​ ప్రారంభోత్సవం​ - తెలంగాణ తాజా వార్తలు

Telangana Brahman Sadan in gopanpally : రాష్ట్రంలో దేవాలయాల పునరుజ్జీవంతో ధార్మిక కార్యక్రమాలు పెరిగాయని.. నేడు తెలంగాణ బ్రాహ్మణులకు ఉపాధి కేంద్రంగా మారిందని సీఎం కేసీఆర్​ అన్నారు. గోపన్​పల్లిలో ఈ నెల 31న తెలంగాణ బ్రహ్మణ్ సదన్​ ప్రారంభోత్సవ ఏర్పాట్లపై.. తెలంగాణ బ్రహ్మణ సంక్షేమ పరిషత్ సభ్యులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.

Brahman Sadan
Brahman Sadan
author img

By

Published : May 27, 2023, 10:50 PM IST

KCR on Telangana Brahman Sadan : రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్థాత్మకంగా నిర్మించిన దేశంలోనే మొట్టమొదటి ‘బ్రాహ్మణ సదన్’ దేశానికే ఆదర్శవంతమైన ఆధ్యాత్మిక, ధార్మిక సమాచార కేంద్రంగా నిలవాలని.. సమాజానికి ధార్మిక దిశానిర్దేశం చేసే కేంద్రంగా రూపుదిద్దుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆకాంక్షించారు.

హైదరాబాద్​ గోపన్​పల్లిలో తొమ్మిదెకరాల విస్తీర్ణంలో నిర్మించిన ‘తెలంగాణ బ్రాహ్మణ్ సదన్’ సీఎం చేతుల మీదుగా ఈ నెల 31న ప్రారంభం కానుంది. బ్రాహ్మణ సంక్షేమ పరిషత్త్​తో ప్రగతి భవన్​లో సమీక్ష నిర్వహించిన కేసీఆర్.. చండీయాగం, సుదర్శన యాగం నిర్వహణ, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే బ్రాహ్మణ సంఘాల నాయకులు, పీఠాధిపతులు, అర్చకులు, వేదపండితులకు చేయాల్సిన ఏర్పాట్లపై చర్చించారు.

spiritual telangana : అర్చక పౌరహిత్యమే జీవనాధారంగా చేసుకుని, నిత్యం భగవత్ సేవలో నిమగ్నమవుతూ, సమస్త లోక క్షేమాన్ని కాంక్షిస్తూ తమ జీవితాలను ధారపోసే బ్రాహ్మణ సమాజాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత సభ్య సమాజం మీద ఉందని ముఖ్యమంత్రి అన్నారు. ఇదే తాత్వికతతో స్వరాష్ట్రంలో బ్రాహ్మణ సంక్షేమాన్ని ప్రభుత్వం ప్రాధామ్యంగా ఎంచుకుని పలు పథకాలు అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

రాష్ట్రం ఆధ్యాత్మిక తెలంగాణగా మారిందని.. దేవాలయాల పునరుజ్జీవంతో రాష్ట్రవ్యాప్తంగా ఆధ్యాత్మిక, ధార్మిక కార్యక్రమాలు విస్తరించాయని అన్నారు. దాంతో ఇతర రాష్ట్రాల నుంచి తెలంగాణ రాష్ట్రానికి ఉపాధి కోసం అర్చకులు, పురోహితులు, వేద పండితులు వలస వస్తున్నారని సీఎం కేసీఆర్ తెలిపారు. అన్ని వర్గాలతో పాటు బ్రాహ్మణులకు కూడా నేడు తెలంగాణ ఉపాధి కేంద్రంగా మారిందని.. బ్రాహ్మణ సమాజానికి భరోసా దొరికిందని అన్నారు.

BRS schemes for brahmans welfare : తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ ఆధ్వర్యంలో గత ఆరేళ్లుగా అమలు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు, అమలును పరిషత్ అధ్యక్షులు కేవీ రమణాచారి వివరించారు. సంక్షేమ పరిషత్ ఏర్పడిన నాటి నుంచి ఇప్పటి వరకు సుమారు 6500 కుటుంబాలకు లబ్ధి చేకూర్చినట్లు తెలిపారు. ప్రస్తుతం అమలు చేస్తున్న పథకాలకు అదనంగా భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు పేద బ్రాహ్మణులకు ఆసరా అందించేలా రూపొందించాలని.. ఈ దిశగా చర్యలు చేపట్టాలని పరిషత్ సభ్యులకు ముఖ్యమంత్రి కేసీఆర్​ సూచించారు.

తెలంగాణ బ్రాహ్మణ సదన్ దేశానికే ఆదర్శవంతమైన రీతిలో సమస్త ఆధ్యాత్మిక ధార్మిక సమాచార కేంద్రంగా పరిఢవిల్లాలని ఆకాంక్షించారు. ఆధ్యాత్మిక సాహిత్యం, క్రతువులకు సంబంధించిన సమాచారాన్ని దేశం నలుమూలల నుంచి సేకరించి పుస్తకాలు, డిజిటల్ రూపంలో భద్రపరచి అందరికీ అందుబాటులో ఉంచాలని సీఎం కేసీఆర్ తెలిపారు.

"బ్రాహ్మణులను కాపాడుకోవాల్సిన బాధ్యత సమాజంపై ఉంది. బ్రాహ్మణ సంక్షేమం ప్రాధామ్యంగా పథకాలు అమలు చేస్తున్నాం. దేవాలయాల పునరుజ్జీవంతో ధార్మిక కార్యక్రమాలు పెరిగాయి. నేడు తెలంగాణ బ్రాహ్మణులకు కూడా ఉపాధి కేంద్రంగా మారింది." - కేసీఆర్​, ముఖ్యమంత్రి

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.