కాంగ్రెస్ వాళ్లు గెలిస్తే చక్కగా గెలిచినట్లు.. మేమైతే డబ్బులు పెట్టి గెలిచినట్లా అని కేసీఆర్ అసెంబ్లీలో ప్రశ్నించారు. ఎవరు తప్పు మాట్లాడితే వాళ్లని ప్రజలు శిక్షిస్తారని పేర్కొన్నారు. మిషన్ భగీరథ ఒక అద్భుతమైన పథకంగా అభివర్ణించారు. 11 రాష్ట్రాలు మన ఇంజినీర్ల సహకారం కోరారని తెలిపారు.
ఒక పథకం అమలుచేస్తే ఏ ప్రభుత్వమైనా పంచాయతీల తీర్మానం తెచ్చిందా అని ప్రశ్నించారు. ప్రజాస్వామ్యంలో అంతిమ విజయం ప్రజలదేనన్న సీఎం.. డబ్బులు పంచి గెలిచింది ఎవరో నల్గొండ ప్రజలందరికి తెలుసన్నారు. అసత్యాలు మాట్లాడితే సహించేది లేదని హెచ్చరించారు.
ఇవీ చూడండి: నేను కేసీఆర్ బొమ్మతో గెలవలేదు: ఎమ్మెల్యే కోమటిరెడ్డి