కరోనాతో చికిత్స పొందుతున్న వారిలో 11 మంది కోలుకున్నారని సీఎం కేసీఆర్ చెప్పారు. వారిని రేపు డిశ్చార్జ్ చేస్తామని వెల్లడించారు. రాష్ట్రంలో 70 కరోనా పాజిటివ్ కేసులుండగా 12 మందికి నెగిటివ్ రాగా మిగతా 58 మంది చికిత్స పొందుతున్నారని తెలిపారు. వారందరూ బాగానే ఉన్నారని పేర్కొన్నారు.
క్వారంటైన్‌లలో ఉన్నవారిని 5,742 బృందాలు పర్యవేక్షిస్తున్నాయని చెప్పారు. వైద్యుల పర్యవేక్షణలో 25,932 మంది ఉన్నారని పేర్కొన్నారు. విదేశాల నుంచి కరోనా సోకినవారు, అనుమానితులు కలిపి మొత్తం 25,932 మంది ఉన్నారన్నారు. రాష్ట్రంలో ఏప్రిల్ 7 తర్వాత కరోనా బాధితులే ఉండరని ప్రకటించారు. కొత్త కేసులు వచ్చే అవకాశం తక్కువగా ఉందన్నారు.
ఇదీ చదవండి: కరోనాపై పోరాటానికి విరాళాల వెల్లువ