కరోనా వైరస్‌పై అసత్య ప్రచారం చేయొద్దని ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా కరోనా వైరస్‌పై స్పందించారు. రాష్ట్రంలో కరోనా లేదని... వైరస్ లేనప్పుడు ఇక మాస్కుల పంపిణీ ఎందుకని ప్రశ్నించారు. దేశంలో 130 కోట్ల జనాభాకి కరోనా కేసులు 31 మాత్రమే నమోదయ్యాయని తెలిపారు.
రాష్ట్రానికి కరోనా వైరస్ రాదు... మేము రానివ్వమని స్పష్టం చేశారు. ఒక వేళ ఈ వైరస్ వస్తే.. మాస్క్‌లు లేకుండానే పనిచేస్తామని వెల్లడించారు. కరోనా వస్తే చిన్న పారాసెటిమాల్ వేస్తే చాలని తనకో శాస్త్రవేత్త ఫోన్ చేసి తెలిపారని ముఖ్యమంత్రి వివరించారు. 22 డిగ్రీలు ఉష్ణోగ్రత దాటితే కరోనా వైరస్ బతకదని... ఇప్పటికే రాష్ట్రంలో ఇప్పటికే ఉష్ణోగ్రత 30 డిగ్రీలు దాటిందని... ఇక కరోనా బతికే అవకాశం ఎక్కడిదని సీఎం ప్రశ్నించారు.