ETV Bharat / state

జాతీయ రాజకీయాలకు సిద్ధమవుతున్న తెరాస.. అసెంబ్లీ సమావేశాలే వేదిక..!

ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషించాలన్న ఆలోచనతో ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. త్వరలో జాతీయ పార్టీ ప్రకటనకు సన్నాహాలు చేస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో అసెంబ్లీ సమావేశాలను అధికార తెరాస అందుకు వేదికగా వినియోగించుకునే పరిస్థితులు కనిపిస్తున్నాయి. కేంద్రప్రభుత్వ వైఖరిని ఎండగడుతూనే తెలంగాణ నమూనా దేశానికి అవసరమన్న వాదనను వినిపించాలని పాలకపక్షం భావిస్తోంది.

KCR in national politics
KCR in national politics
author img

By

Published : Sep 11, 2022, 10:10 AM IST

రేపటి నుంచి జరగబోయే శాసనసభ, మండలి సమావేశాలు ఈసారి వాడివేడిగా జరగనున్నాయి. రాష్ట్రం విషయంలో కేంద్ర ప్రభుత్వ వైఖరిని ఎండగట్టడమే లక్ష్యంగా శాసనసభ సమావేశాలు జరిగే అవకాశం కనిపిస్తోంది. సంబంధిత అంశాలపైనే రెండ్రోజుల పాటు చర్చసాగే అవకాశం ఉంది. జాతీయ రాజకీయాల దిశగా కేసీఆర్ అడుగుల నేపథ్యంలో తెరాస అందుకు అనుగుణంగా సభలో వాణి వినిపించే పరిస్థితులు కనిపిస్తున్నాయి.

రాష్ట్రంపై కేంద్ర ప్రభుత్వ వైఖరి ఎండగట్టే ప్రయత్నం: రేపు, ఎల్లుండి శాసనసభ, మండలి సమావేశం కానున్నాయి. శాసనసభలో చర్చించే అంశాలకు సంబంధించి ఆయా పార్టీలు సభాపతికి ప్రతిపాదనలిచ్చాయి. సోమ, మంగళ వారాల్లో ప్రశ్నోత్తరాలు లేకుండా నేరుగా స్వల్పకాలిక చర్చను తీసుకునే అవకాశం కనిపిస్తోంది. రాష్ట్రంపై కేంద్రం అనుసరిస్తున్న విధానాలు, వైఖరి సమావేశాల్లో చర్చకొచ్చే పరిస్థితి కనిపిస్తోంది. కొత్త రాష్ట్రమైన తెలంగాణ అభివృద్ధికి చేయూతనిస్తూ అండగా నిలవాల్సిన కేంద్రం.. పదేపదే అడ్డంకులు సృష్టిస్తోందన్న రాష్ట్రప్రభుత్వం అదే విషయాన్ని అసెంబ్లీ వేదికగా మరోమారు బలంగా చాటాలని యత్నిస్తోంది.

ఎఫ్​ఆర్​బీఎమ్​ రుణాల ప్రస్తావన: మజ్లిస్, కాంగ్రెస్ ప్రతిపాదించిన అంశాల్లోనూ రాష్ట్రం, కేంద్రప్రభుత్వ వైఖరి, సంబంధాల అంశాలున్నాయి. వాటన్నింటి నేపథ్యంలో రెండు రోజుల పాటు రాష్ట్రం విషయంలో కేంద్రానికి సంబంధించిన అంశాలపై స్వల్పకాలిక చర్చ చేపట్టే అవకాశం కనిపిస్తోంది. ఎఫ్ఆర్​బీఎమ్ పరిధికి లోబడి రాష్ట్రప్రభుత్వం తీసుకునే రుణాల విషయంలో కేంద్రం ఆంక్షలు విధించింది. గతంలో తీసుకున్న బడ్జెటేతర అప్పులపై అభ్యంతరం వ్యక్తంచేసి ఎఫ్ఆర్​బీఎమ్ రుణాల మొత్తంలో కోత విధించింది.

పలు తీర్మనాలు చేసే అవకాశం: విద్యుత్ బకాయిల విషయంలో ఆంధ్రప్రదేశ్‌కు రూ.6,756 కోట్లు చెల్లించాలంటూ కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. వాటితో పాటు ఇతర అంశాల విషయంలో కేంద్రం వైఖరిపై రాష్ట్ర ప్రభుత్వం గుర్రుగా ఉంది. అన్ని అంశాలపై సభలో చర్చించి ప్రజల్లోకి తీసుకెళ్లాలని అధికార తెరాస భావిస్తోంది. ఇందుకు సంబంధించి తీర్మానాలు కూడా చేసే అవకాశం లేకపోలేదని అంటున్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.