ETV Bharat / state

ధాన్యం కొనుగోళ్ల పేరుతో నిలువు దోపిడీ: కిసాన్ కాంగ్రెస్ - Kisan Congress latest News

రాష్ట్ర ప్రభుత్వం చేస్తోన్న వరి ధాన్యం కొనుగోళ్లలో అన్నదాతలు నిలువు దోపిడీకి గురయ్యారని కిసాన్ కాంగ్రెస్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. రైతులకు రావాల్సిన వేల రూపాయల్లో కోత విధించి ఎవరి జేబులు నింపుకున్నారని మండిపడింది.

రైతులను నిలువు దోపిడీ చేస్తోన్న కేసీఆర్ సర్కార్ : కిసాన్ కాంగ్రెస్

author img

By

Published : Aug 3, 2020, 5:14 PM IST

రాష్ట్రంలో వరి ధాన్యం కొనుగోళ్లలో రైతులు నిలువు దోపిడీకి గురయ్యారని కిసాన్‌ కాంగ్రెస్‌ రాష్ట్ర అధ్యక్షుడు అన్వేష్‌ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ట్రాక్‌ సీటులో రైతుకు సంబంధం లేకుండానే సంచుల సంఖ్య తగ్గిస్తున్నారని మండిపడ్డారు.

ఐకేపీ కేంద్రాలు, సహకార సంఘాలు కొనుగోలు చేసిన దాన్యం విషయంలో తరుగు పేరుతో క్వింటాలుకు 4 కిలోలు తీసి మిల్లర్ల వద్దకు వెళ్ళిన తర్వాత మళ్లీ 5 నుంచి 10 కిలోలు తరుగు పేరుతో అదనంగా తీస్తున్నారని ధ్వజమెత్తారు. ట్రాక్ సీటులో రాసిన బస్తాల సంఖ్యను కొట్టేసి తక్కువ రాస్తున్న ఘటనలు కూడా ఉన్నాయన్నారు.

ఎవరి జేబులు నింపుకున్నారు...

నిజామాబాద్ జిల్లాలో 118 బస్తాలు కలిగిన రైతు 5 కిలోల కడ్తాకు ఒప్పుకున్న తర్వాత 44.84 క్వింటాళ్లకు 82,281 రూపాయలు రావాల్సి ఉండగా రైతు ఖాతాలో 74,868 రూపాయలు జమ చేశారని పేర్కొన్నారు. ఈ లెక్కన 7,413 రూపాయలు తక్కువ జమ చేశారని స్పష్టం చేశారు.

జగిత్యాల జిల్లా తిమ్మాపూర్ గ్రామానికి చెందిన రైతు 616 బస్తాలకు బదులు 560 బస్తాలకు డబ్బులు వేయడం వల్ల ఆ రైతు దాదాపు రూ.18,000 వేల రూపాయలు నష్టపోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులకు రావాల్సిన డబ్బులో కోత విధించి ఎవరి జేబులు నింపుకున్నారని ప్రశ్నించారు. అన్నదాతలను నిలువు దోపిడీకి గురి చేస్తున్న అవినీతిపై విచారణ చేయించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నష్టపోయిన రైతులకు న్యాయం చేయాలని తెలంగాణ కిసాన్ కాంగ్రెస్ తరఫున స్పష్టం చేశారు.

ఇవీ చూడండి : నర్సింహులు మృతిపట్ల ప్రతిపక్షాల విమర్శలను ఖండించిన ఎమ్మెల్యే

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.