కలెక్టర్ల చేతిలో నియంత్రణ మాత్రమే పెట్టాం... వారికి పూర్తి అధికారాలు ఇవ్వలేదని ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీలో స్పష్టం చేశారు . తెలంగాణ పురపాలక చట్టంపై అభిప్రాయాలు తెలిపిన సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు. సభ్యులు సలహాలు, సూచనలను పరిగణలోకి తీసుకుంటామని పేర్కొన్నారు. విపక్ష సభ్యలు లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానం ఇస్తున్న సందర్భంలో సీఎం... కాంగ్రెస్ తీరుపై మండిపడ్డారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడటమే కాంగ్రెస్ లక్ష్యమని వ్యాఖ్యానించారు. కలెక్టర్ వ్యవస్థను కించపరిచేలా సూచనలు చేయడం సరికాదన్నారు. జనాభా దామాషా ప్రకారమే రిజర్వేషన్లు అమలు చేస్తామని మరోసారి స్పష్టం చేశారు.
'కలెక్టర్లకు పూర్తి అధికారాలు ఇవ్వలేదు నియంత్రణ మాత్రమే '
రెండో రోజు అసెంబ్లీలో కొత్త పురపాలక ముసాయిదా బిల్లుపై చర్చించారు. విపక్ష సభ్యులు లేవనెత్తిన ప్రశ్నలకు సీఎం కేసీఆర్ సమాధానం చెప్పారు. అనవసర ఆరోపణలు చేస్తున్న కాంగ్రెస్ తమ వైఖరి మార్చుకోవాలని సూచించారు.