ETV Bharat / state

మొగిలయ్య, నిఖత్ జరీన్, ఇషా సింగ్​లకు నగదు ప్రోత్సాహం - telangana formation day 2022

Telangana Formation day 2022: రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ పబ్లిక్ గార్డెన్స్​లో వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కిన్నెర మెట్ల కళాకారుడు, పద్మశ్రీ అవార్డు గ్రహీత మొగిలయ్యకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున రూ. కోటి నజరానా చెక్కును సీఎం కేసీఆర్ అందించారు. అదే విధంగా అంతర్జాతీయ స్థాయిలో పతకాలు అందుకున్న నిఖత్ జరీన్, ఇషా సింగ్​లకు రూ. 2 కోట్ల చొప్పున చెక్కులను అందించారు.

cheque to kinnere mogilaiah
కిన్నెర మొగిలయ్యకు చెక్కు అందజేత
author img

By

Published : Jun 2, 2022, 12:26 PM IST

Telangana Formation day 2022: హైదరాబాద్ పబ్లిక్‌గార్డెన్స్‌లో సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు ఘనంగా జరిగాయి. కార్యక్రమంలో కిన్నెరమెట్ల కళాకారుడు, పద్మశ్రీ అవార్డు గ్రహీత మొగిలయ్యకు గతంలో ప్రభుత్వం ప్రకటించిన రూ.కోటి నజరానా చెక్కును కేసీఆర్‌ ఆయనకు అందించి సన్మానించారు. అదే విధంగా మొగిలయ్య కోరినట్లు ఆయనకు బీఎన్‌రెడ్డి నగర్‌ కాలనీలో ఇంటిస్థలాన్ని కేటాయించాలని నిర్ణయించింది.

cheque to nikhath jareen
నిఖత్ జరీన్​కు రూ. 2 కోట్ల చెక్కును అందజేస్తున్న సీఎం కేసీఆర్
cheque to isha singh
ఇషా సింగ్​కు రూ. 2 కోట్ల చెక్కును అందజేస్తున్న సీఎం కేసీఆర్

అదేవిధంగా అంతర్జాతీయ స్థాయిలో పతకాలు అందుకున్న తెలంగాణ క్రీడాకారులకు సీఎం కేసీఆర్‌ నగదు ప్రోత్సాహాన్ని అందజేశారు. ఇటీవల టర్కీలో జరిగిన ప్రపంచ బాక్సింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో బంగారు పతకం సాధించిన నిఖత్‌ జరీన్‌, జర్మనీలో జరిగిన ఐ.ఎస్‌.ఎస్‌.ఎఫ్‌. జూనియర్‌ ప్రపంచ కప్‌ షూటింగ్‌ పోటీల్లో బంగారు పతకం సాధించిన ఇషా సింగ్‌లకు రూ.2 కోట్ల చొప్పున ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు సీఎం కేసీఆర్‌ వారికి రూ.2 కోట్ల చొప్పున చెక్కులను అందజేసి సత్కరించారు. దీంతోపాటు నిఖత్‌ జరీన్‌, ఇషాసింగ్‌లకు జూబ్లీహిల్స్‌ ప్రాంతంలో నివాస స్థలాలను ప్రభుత్వం కేటాయించింది.

ఇవీ చదవండి: CM KCR : 'తెలంగాణ సజల, సుజల, సస్యశ్యామలంగా మారింది'

'అభివృద్ధిలో అద్భుతంగా దూసుకెళ్తున్న తెలంగాణకు సలామ్‌'

IPL 2022: చర్చంతా కోహ్లీ, ఆర్సీబీ గురించే.. నెటిజన్ల రచ్చ రచ్చ!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.