ETV Bharat / state

'నా కుమారుడు కనిపించలేదు..' డీజీపీకి కేసీఆర్​ అన్న కుమార్తె ఫిర్యాదు

Ramya Rao Went To DGP Office: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్న కుమార్తె రమ్య రావు తన కుమారుడు కనిపించడం లేదంటూ డీజీపీ అంజనీ కుమార్​కు ఫిర్యాదు చేశారు. తన కుమారుడిని తీసుకెళ్లిన పోలీసులు అరెస్టు చేసినట్లు చూపించడం లేదని.. దీనిపై వెంటనే స్పందించాలని ఆమె డిమాండ్ చేశారు.

ramya rao
రమ్యరావు
author img

By

Published : Feb 4, 2023, 8:49 PM IST

Updated : Feb 4, 2023, 9:22 PM IST

KCR Brother Daughter Ramya Rao Went To DGP Office: ముఖ్యమంత్రి కేసీఆర్ అన్న కుమార్తె రమ్యరావు హైదరాబాద్ డీజీపీ కార్యాలయానికి వచ్చారు. డీజీపీని కలవడానికి అనుమతించాలన్నారు. అక్కడ ఉన్న పోలీసులు అనుమతించకపోవడంతో వారితో ఆమె వాగ్వాదానికి దిగారు. దీంతో ఆమె అక్కడే బైఠాయించడంతో.. కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది. తన కొడుకు ప్రివెంటీవ్ అరెస్టుపై డీజీపీని కలవడానికి వస్తే పోలీసులు అడ్డుకున్నారని తెలిపారు. అందుకే ఆందోళనకు దిగుతున్నానని చెప్పారు.

అనంతరం రమ్యరావును డీజీపీని కలవడానికి అనుమతించడంతో లోపలికి వెళ్లారు. గత గురువారం అర్ధరాత్రి బంజారాహిల్స్ పోలీసులం అంటూ కొందరు వ్యక్తులు మా ఇంటికి వచ్చారని.. నా కొడుకు ఇంట్లో లేడు అని చెప్పిన వినకుండా ఇల్లు మొత్తం వెతికారని ఆమె తెలిపారు. ఆఖరికి వాటర్ ట్యాంకులో సైతం నా కొడుకు ఉన్నాడో లేడో అని చూడారని ఆవేదన వ్యక్తం చేశారు. మా ఇంటికి వచ్చిన పోలీసులు చాలా అసభ్యంగా మాట్లాడారన్నారు. వారు నిజంగానే పోలీసులేనా అన్న అనుమానం తనకు కలుగుతుందన్నారు. స్కామ్​లు చేసే వారికి రక్షణ కల్పిస్తున్న పోలీసులు.. విద్యార్థులు, ప్రజలను రక్షించకుండా ఉంటున్నారని మండిపడ్డారు. అన్ని పోలీస్​ స్టేషన్​లకు తిరిగాను. ఎక్కడా నా కుమారుడు లేదు. అసలు ఏం చేశారని ప్రశ్నించారు.

పోలీసులు మా ఇంటికి వచ్చిన దగ్గర నుంచి నా కొడుకు కనిపించడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. కానిస్టేబుల్, ఎస్సై అభ్యర్థులకు మద్దతుగా ఎన్​ఎస్​యూఐ ఆధ్వర్యంలో అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చారని.. అందులో భాగంగా పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేశారని రమ్యరావు తెలిపారు. నా కొడుకుతో పాటు, ఎన్​ఎస్​యూఐ ప్రెసిడెంట్ వెంకట్ బల్మూరి, ఇతర విద్యార్థుల ఆచూకీ వెంటనే తెలపాలని డిమాండ్ చేశారు. ఒక్క మహిళా పోలీసు కూడా లేకుండా అర్ధరాత్రి నా ఇంటికి వచ్చిన బంజారాహిల్స్ పోలీసులు తనకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

"నేను నిన్నటి నుంచి ప్రతి పోలీస్​ స్టేషన్​కు నా మనుషులను పంపిస్తున్నాను. మొత్తం అన్ని పోలీస్​ స్టేషన్​లు వెతికాను. ఎక్కడా కనిపించలేదు. ఈ ఖాకీ చొక్కా వేసుకున్నారని ఇంతకి తెగిస్తున్నారా.. వీరు పోలీస్​ల లేక బీఆర్​ఎస్​ గూండాల.. నా కుమారుడిని ఎప్పుడు పంపిస్తారు? అసలు నా కొడుకును, విద్యార్థులను ఏం చేయాలనుకున్నారు. స్కాంలు చేసిన వారికి భద్రత కల్పిస్తున్నారు. కానీ విద్యార్థులకు, ప్రజలకు అసలు రక్షణ ఇవ్వరు." - రమ్యరావు, కేసీఆర్​ అన్న కుమార్తె

'నా కుమారుడు కనిపించలేదు..' డీజీపీకి కేసీఆర్​ అన్న కుమార్తె ఫిర్యాదు

ఇవీ చదవండి

Last Updated : Feb 4, 2023, 9:22 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.