తిరువనంతపురంలోని కౌడియర్ ప్యాలెస్లో ట్రావెన్ కోర్ మహారాణి గౌరి లక్ష్మీబాయి, ప్రిన్స్ ఆదిత్య వర్మలను ఎంపీ కవిత మర్యాదపూర్వకంగా కలిశారు. సాదరంగా ఆహ్వానించిన మహారాణి... కవితతో కాసేపు ముచ్చటించారు. తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ కార్యక్రమాలను అడిగి తెలుసుకున్నారు. పద్మనాభ స్వామి ప్రతిమతో పాటు ఆమె రాసిన అనంత పద్మనాభ స్వామి ఆలయ చరిత్ర, వైశిష్ట్యం పుస్తకాన్ని కవితకు బహూకరించారు. పోచంపల్లి శాలువతో మహారాణి లక్ష్మీబాయిని ఎంపీ సత్కరించారు.
ఇదీ చదవండి:పైలట్ సింధు!