లాక్డౌన్ పరిస్థితులపై మంత్రి కేటీఆర్, ఆయన సోదరి మాజీ ఎంపీ కవిత మధ్య ట్విట్టర్లో సరదా సంభాషణ జరిగింది. ఈనెల 20 తర్వాత హెయిర్ సెలూన్లు తెరిచే ఆలోచన ఉందా అని శరత్ చంద్ర అనే ఓ నెటిజన్ కేటీఆర్‌కు ట్వీట్ చేశారు. తన వెంట్రుకలు కట్ చేసేందుకు తన భార్య ప్రయత్నిస్తోందని.. అదే జరిగితే లాక్డౌన్ ఎత్తివేసినప్పటికీ... తాను ఇంట్లోనే ఉండాల్సి వస్తుందని పేర్కొన్నారు.
స్పందించిన కేటీఆర్.. విరాట్ కోహ్లీనే తన భార్యతో హెయిర్ స్టయిల్ చేయించుకున్నారని.. మీరెందుకు చేసుకోకూడదని ట్వీట్ చేశారు. దానిపై కవిత స్పందిస్తూ.. వదినకు కూడా అవకాశం ఇస్తావా అన్నయ్య అంటూ కేటీఆర్‌ను ఉద్దేశించి సరదా ట్వీట్ చేశారు.
ఇదీ చూడండి: సీసీసీకి రామోజీరావు విరాళం.. కృతజ్ఞతలు తెలిపిన చిరు