నాలెడ్జ్ భాగస్వామి డెలాయిట్తో కలిసి 4వ పారిశ్రామిక విప్లవం కోసం మహిళలను సిద్ధం చేయడం, భారతదేశంలో లింగ సమానత్వం అవార్డులను ప్రదానం చేసే పద్ధతులపైనా ఈ సదస్సులో చర్చిస్తారు. మన దేశ వ్యాపారాలు, విద్యాసంస్థలు, పౌర సమాజ సంస్థలకు బాధ్యతాయుతమైన వ్యాపార విధానాలు బలోపేతం చేయడమే లక్ష్యంగా ఈ వేదికగా వ్యవహరిస్తోంది.
నాల్గవ పారిశ్రామిక విప్లవం ద్వారా వ్యాపార, సాంకేతికత, ఆటోమేషన్లలో మానవ-డిజిటల్ ఇంటర్ఫేస్ పాత్ర పెరిగింది. దీని వల్ల మన దేశంలోనూ యువత ఆయా రంగాల్లో తగిన నైపుణ్యాన్ని పెంపొందించుకోవడం తప్పని సరైంది. ఉపాధి, నైపుణ్య సముపార్జనలోనూ మహిళలు పురోగమించేందుకు అవసరమైన నైపుణ్యాలు, సాంకేతికంగా పట్టుసాధించడం, విద్యావిధాన మార్పులపై కూలంకషంగా చర్చిస్తారు.