Kavita met KCR at Pragati Bhavan: దిల్లీ నుంచి వచ్చిన బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత ముఖ్యమంత్రి కేసీఆర్‌తో సమావేశమయ్యారు. ఈడీ విచారణ అనంతరం ఇవాళ మధ్యాహ్నం దిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో బేగంపేట విమానాశ్రయం చేరుకున్నారు. మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు, శ్రీనివాస్ గౌడ్, ఎంపీ సంతోష్, కవితతో పాటు ప్రత్యేక విమానంలో వచ్చారు. అక్కణ్నుంచి వారు నేరుగా ప్రగతిభవన్‌కు వెళ్లారు. ఉగాది సందర్భంగా ప్రగతిభవన్‌లో పూజల్లో వారు పాల్గొన్నట్లు సమాచారం.
అనంతరం దిల్లీ పరిణామాలు, ఈడీ విచారణ గురించి ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఎమ్మెల్సీ కవిత వివరించినట్లు తెలిసింది. ఈడీ అడిగిన ప్రశ్నలు, తన సమాధానాలతో పాటు నిన్నంతా జరిగిన పరిణామాలను వివరించినట్లు తెలుస్తోంది. ఈ విషయంలో తదుపరి కార్యాచరణపైనా కూడా చర్చించినట్లు సమాచారం. ఈ నెల 24వ తేదీన సుప్రీంకోర్టులో కేసు విచారణ నేపథ్యంలో అందుకు సంబంధించిన అంశాలపై కూడా వారు చర్చించినట్లు తెలిసింది.
ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ తనకు జారీచేసిన సమన్లను కొట్టేయాలని కోరుతూ కవిత సుప్రీంకోర్టులో దాఖలు ఈ రిట్ పిటిషన్ వేసింది. ఈ కేసులో తమ వాదనలు వినకుండా ఎటువంటి ఉత్తర్వులు జారీ చేయొద్దని ఈ పిటిషన్ వేసింది. దీనిపై ఎల్లుండి సుప్రీంకోర్టు ఇచ్చే ఆదేశాలు దర్యాప్తులో కీలకం కానున్నాయి.
దిల్లీ మద్యం కుంభకోణం కేసులో కవితకు భాగం ఉదంటూ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఇప్పటికీ రెండుసార్లు కవితను దిల్లీలోని తమ కార్యాలయంలో విచారించింది. రెండుసార్లు సుదీర్ఘంగా విచారణ సాగింది. నిన్నటి విచారణలో కవిత తాను గతంలో వినియోగించిన ఫోన్లను ఈడీ అధికారులకు సమర్పించింది.
మహిళా రిజర్వేషన్లపై కవిత ట్వీట్: మరోవైపు మహిళల చుట్టూ ఉన్న అడ్డంకులను తరిమికొట్టేందుకు... మహిళల సాధికారతకై అడుగులు వేసేందుకు అందరూ చేతులు కలుపుదాం అని కవిత ట్వీట్ చేశారు. చట్ట సభల్లో మహిళా బిల్లుపై పోరాడుదాం అన్నారు. అన్నింటా సగంగా ఉన్న మహిళలు కేవలం 33శాతం రిజర్వేషన్‌ను మాత్రమే అడుగుతున్నామంటూ కవిత ట్విటర్‌లో వీడియో పోస్ట్ చేశారు. ఈనెల పదో తారీఖున కూడా జంతర్ మంతర్ వద్ద కవిత భారీ స్థాయిలో మహిళా రిజర్వేషన్ల బిల్ అమలు చేాయలంటూ ఆందోళన చేపట్టారు. మోదీ సర్కార్ ఎన్నికల హామీని గత ఎనిమిది ఏళ్లుగా తుంగలో తొక్కారని.. వెంటనే బిల్‌ను ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు.
-
This Navratri let's work together to break down barriers and empower women to reach their full potential.#WomenReservationBill #MorePowerToWomen pic.twitter.com/qKk9KrL0za
— Kavitha Kalvakuntla (@RaoKavitha) March 22, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">This Navratri let's work together to break down barriers and empower women to reach their full potential.#WomenReservationBill #MorePowerToWomen pic.twitter.com/qKk9KrL0za
— Kavitha Kalvakuntla (@RaoKavitha) March 22, 2023This Navratri let's work together to break down barriers and empower women to reach their full potential.#WomenReservationBill #MorePowerToWomen pic.twitter.com/qKk9KrL0za
— Kavitha Kalvakuntla (@RaoKavitha) March 22, 2023
ఇవీ చదవండి: