ETV Bharat / state

కార్తిక మాసం - ఆ దీపం వెలిగిస్తున్నారా - ఏడాది పుణ్యం!

365 Wicks Light on Karthika Pournami : కార్తిక మాసంలో.. ప్రతిరోజూ దీపం వెలిగించి భగవంతుడిని పూజిస్తారు భక్తులు. అయితే.. కార్తిక మాసం మొత్తంలో వెలిగించే అద్వితీయమైన దీపాన్ని మీరు వెలిగిస్తున్నారా? అసలు.. ఆ దీపాన్ని ఎప్పుడు.. ఎందుకు వెలిగిస్తారో మీకు తెలుసా?

365 Wicks Light on Karthika Pournami
365 Wicks Light on Karthika Pournami
author img

By ETV Bharat Telangana Team

Published : Nov 26, 2023, 4:56 PM IST

365 Wicks Light on Karthika Pournami : హిందూ పురాణాల్లో కార్తిక మాసానికి ఎంతో విశిష్టత ఉంది. ఆలయాలన్నీ దీపాల కాంతుల్లో కళకళలాడుతుంటాయి. హరిహర నామస్మరణలతో మార్మోగుతుంటాయి. దీపావళి మరుసటి రోజు నుంచి ప్రారంభమైన ఈ కార్తిక మాసంలో.. తెలుగు రాష్ట్రాల్లోని భక్తులు నియమనిష్టలతో పూజలు చేస్తున్నారు.

ఈ మాసంలోని ప్రతి రోజూ ఎంతో ప్రముఖమైనదే. ఈ నెలలో వచ్చేవన్నీ మంచి రోజులే అన్నది పురాణాలు చెబుతున్న మాట. అందుకే.. ఈ మాసంలో చేసే పూజలకూ, వ్రతాలకూ ఎంతో గొప్ప ఫలితం ఉంటుందని పండితులు సైతం పేర్కొంటున్నాయి. అయితే.. కార్తిక మాసంలో అత్యంత విశిష్టమైన రోజు కార్తిక పౌర్ణమి. ఈ తిథి రెండు రోజుల్లో వచ్చింది.

దృక్ పంచాంగం ప్రకారం.. కార్తిక పౌర్ణమి తిథి నవంబర్ 26 (ఆదివారం) మధ్యాహ్నం 3గంటల 53 నిమిషాలకు ప్రారంభమవుతుంది. నవంబర్ 27 మధ్యాహ్నం 2గంటల 45 గంటలకు ముగుస్తుంది. అయితే.. కార్తిక పౌర్ణమి రోజున చేయాల్సిన ప్రధానమైన పని దీపం వెలిగించడం. ఈ పని రాత్రివేళ మాత్రమే చేస్తారు. అదే సమయంలో కృత్తిక నక్షత్రం కూడా ఉండాలి. ఇలా చూసుకున్నప్పుడు 26వ తేదీనే కార్తిక పౌర్ణమి జరుపుకోవాలని పండితులు సూచిస్తున్నారు.

కార్తిక పౌర్ణమి ఎప్పుడు - 26నా? 27వ తేదీనా?

ఈ రోజున మహిళా భక్తులు అతిపెద్ద దీపాన్ని వెలిగిస్తారు. అదే.. 365 వత్తుల దీపం. ఈ దీపం ప్రతిఒక్కరూ వెలిగిస్తారు. ఎందుకంటే.. హిందూ ఆచారాల్లో ప్రతి ఇంటా సాయంత్రం దీపం వెలిగించాలి. ఆ విధంగా లక్ష్మీదేవిని ఇంటికి ఆహ్వానిస్తారు. అయితే.. ఏడాది కాలంలో ఏదైనా ఒకరోజు దీపం వెలిగించలేకపోతే.. ఆ పాపాన్ని 365 వత్తుల దీపం భర్తీ చేస్తుందని పండితులు చెబుతున్నారు. అంతేకాదు.. ఈ 365 వత్తుల దీపం వెలిగించడం.. ప్రాణికోటికి మేలు చేసినట్టు అవుతుందని పండితులు చెబుతున్నారు. అందువల్ల.. ప్రతి ఒక్కరూ 365 వత్తుల దీపాన్ని వెలిగించాలని సూచిస్తున్నారు.

కార్తీక పౌర్ణమి ప్రాముఖ్యత :

అత్యంత పవిత్రమైన కార్తీక మాసంలో భక్తులు శ్రీమహావిష్ణువును, పరమేశ్వరుడిని పూజిస్తారు. హరిహర సుతుడు అయ్యప్పను సైతం ఘనంగా పూజిస్తారు. వారి అనుగ్రహం కోసం దేవాలయాలను సందర్శించి, దీపాలు వెలిగిస్తారు. కార్తిక మాసం మొత్తం ఉపవాసం చేస్తారు. మాంసాహారానికి దూరంగా ఉంటారు. ఇలా.. కార్తిక మాసం మొత్తం దైవ సేవలు గడుపుతారు. ఇదే సమయంలో.. అభిషేక ప్రియుడైన శివునికి పాలు, తేనెతో అభిషేకం చేస్తారు. దీనినే 'రుద్రాభిషేకం' అంటారు. అయితే.. కార్తిక మాసం మధ్యలో వచ్చే కార్తిక పౌర్ణమి.. ఈ నెలలోనే అత్యంత విశిష్టమైన రోజుగా భావిస్తారు. ఈ రోజున దీపం వెలిగించి భగవంతుడిని అర్చిస్తే.. తప్పక పుణ్యఫలం దక్కుతుందని భావిస్తారు. అందుకే కార్తిక పౌర్ణమి రోజున.. 365 వత్తుల దీపాన్ని వెలిగించి పూజలు చేస్తారు. ఇలా చేయడం వల్ల.. వెయ్యి యుగాలలో చేసిన పాపాలన్నీ తొలగిపోతాయని భక్తులు నమ్ముతారు.

కార్తిక మాసం ఏ రోజు నుంచి ప్రారంభం? ముఖ్యమైన తేదీలివే!

కార్తికమాసంలో ఏ దేవుళ్లను పూజించాలి? - పండితులు ఏం చెబుతున్నారు?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.