Kuwait Kartika Masam Celebrations 2021: కరోనా వచ్చాక.. మొదటిసారిగా కువైట్‌లో తెలుగు కళాసమితి ఆధ్వర్యంలో కార్తికమాస వనభోజనాల వేడుక నిర్వహించారు. ఇరు రాష్ట్రాల తెలుగు ప్రజలు.. సుమారు 250 కుటుంబాలు కార్తిక వనభోజనం (Kartika Masam Celebrations)లో పాల్గొన్నారు. దాదాపు రెండు సంవత్సరాల తరువాత అందరు కలిసి ఇలా వేడుక నిర్వహించుకోవడం చాలా ఆనందంగా ఉందంటూ నిర్వాహకులు తెలిపారు.
ఉదయం 8.30 నుంచే పెద్దలు, పిల్లలు అంతా ఒకచోట చేరి అల్పాహారం సేవించారు. అనంతరం అందరు కలిసి వినోద కార్యక్రమాల్లో పాల్గొన్నారు. పెద్దలు పిల్లలు కలిసి ఆడేలా బాల్ వాకింగ్, బాల్ పాసింగ్, స్క్విడ్ గేమ్, సింగిల్ లెగ్ రేస్, త్రో బాల్, కోకో, డాడ్జ్ బాల్, మ్యూజికల్ ఛైర్స్, వన్ మినిట్ గేమ్స్, బ్యాంగిల్స్ & స్ట్రాస్, వాలీ బాల్, క్రికెట్, థగ్ ఆఫ్ వార్ వంటి అన్ని గేమ్స్ ఆడి సందడిగా గడిపారు.
ఈ కార్యక్రమంలో ఏపీలోని వరద బాధితులకు సహాయం చేయాలనే సదుద్దేశంతో.. బాధితుల సహాయార్థం తెలుగు కళాసమితి కువైట్ విరాళాలను సేకరించింది. అనంతరం హౌసీ, లక్కీ డిప్ కార్యక్రమాలు నిర్వహించి.. గెలిచినవారికి ఆకర్షణీయమైన బహుమతులిచ్చారు.
ఇవీ చూడండి: