ETV Bharat / state

భోలక్​పూర్​లో వైభవంగా కార్తీక దీపోత్సవం

author img

By

Published : Nov 24, 2020, 8:02 AM IST

భోలక్​పూర్​ శ్రీ భవాని శంకర్ ఆలయంలో కార్తీక దీపోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కరోనా నిబంధనలు పాటిస్తూ మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. లోక కల్యాణార్థం ఈ వేడుకలను నిర్వహిస్తున్నట్లు భాజపా ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కె.లక్ష్మణ్ వివరించారు.

karthika deepotsavam at bholakpur in hyderabad
భోలక్​పూర్​లో వైభవంగా కార్తీక దీపోత్సవం

హైదరాబాద్ ముషీరాబాద్ భోలక్ పూర్​లోని శ్రీ భవాని శంకర్ దేవాలయంలో కార్తీక దీపోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. లోక కల్యాణార్థం ఈ వేడుకలను నిర్వహిస్తున్నట్లు భాజపా ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కె.లక్ష్మణ్ తెలిపారు. మహమ్మారి నుంచి ప్రజలను రక్షించాలని దేవుడిని ప్రార్థిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. భోలక్ పూర్​లోని శ్రీ భవాని శంకర్ దేవాలయంలో అక్షయ స్ఫూర్తి సంస్థ నిర్మించిన కార్తీక దీపోత్సవ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు.

భోలక్​పూర్​లో వైభవంగా కార్తీక దీపోత్సవం

భక్తులు మాస్కులు ధరించి... కరోనా నియమాలు పాటిస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఇదీ చదవండి: భద్రాచలంలో శోభాయమానంగా కార్తీక కాంతులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.