HD Kumaraswamy Comments on KCR : నీటిపారుదల ప్రాజెక్టులు, సంక్షేమ పథకాల అమలులో తనకు మాజీ ప్రధానమంత్రి హెచ్.డి.దేవెగౌడ తర్వాత తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆరే స్ఫూర్తి అని కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్.డి.కుమారస్వామి వ్యాఖ్యానించారు. ఆయన ఇటీవల రాయచూరులో నిర్వహించిన పంచరత్న రథయాత్రలో మాట్లాడుతూ తెలంగాణలో కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ద్వారా ఎన్నో జిల్లాలకు నిరంతరం నీరు అందిస్తున్న కేసీఆర్ తనకు స్ఫూర్తిగా నిలుస్తున్నారని అన్నారు.
తెలంగాణ ప్రభుత్వ మిషన్ భగీరథ.. కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న జల్‌జీవన్ మిషన్‌కు ఏమాత్రం తీసిపోదని కుమారస్వామి చెప్పారు. తనకు మరోమారు అధికారాన్ని అందిస్తే తెలంగాణ తరహా సంక్షేమ పథకాలను అమలు చేస్తానని ఆయన ప్రకటించారు. కుమారిస్వామి వ్యాఖ్యలు కర్ణాటక రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు తావిచ్చింది.