ETV Bharat / state

ప్లాట్లు తక్కువ ధరకే లభిస్తున్నాయా.. జాగ్రత్త! - కాప్రా తహసీల్దార్

ప్రభుత్వ భూములు కొని మోసపోవద్దని కాప్రా తహసీల్దార్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. సికింద్రాబాద్ జవహర్​నగర్ ​సర్వే నెం. 347లో ఉన్నవన్నీ ప్రభుత్వ భూములేనని స్పష్టం చేశారు.

kapra mro appealed to the people not to buy govt lands and cheat.
ప్లాట్లు తక్కువ ధరకే లభిస్తున్నాయా.. జాగ్రత్త!
author img

By

Published : Dec 23, 2020, 7:16 PM IST

ప్రజలు భూకబ్జాదారులను నమ్ముతూ.. ప్రభుత్వ భూములు కొని మోసపోతున్నారని హైదరాబాద్ కాప్రా తహసీల్దార్ గౌతమ్ పేర్కొన్నారు. ప్లాట్లు తక్కువ ధరకే లభిస్తున్నాయంటూ.. ప్రజలను మభ్య పెడుతున్నారన్నారు. వారి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు.

ప్రభుత్వ స్థలాల్లో అక్రమ లే-అవుట్​లు చేసేవారిని ప్రజలు గుర్తించాలని తహసీల్దార్ విజ్ఞప్తి చేసారు. అనుమానం వచ్చిన వ్యక్తులను నిలదీసి, ఆ సమాచారం తమకు తెలపాలని కోరారు. నిందితులపై చట్టరీత్యా క్రిమినల్ కేసులు నమోదు చేయిస్తామని స్పష్టం చేసారు.

సికింద్రాబాద్ జవహర్​నగర్ ​సర్వే నెం. 347లోని ఐదెకరాల్లో ప్రభుత్వ సూచిక బోర్డులు ఏర్పాటు చేశామని తహసీల్దార్ పేర్కొన్నారు. బోర్డులు తొలగిస్తే.. కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

ఇదీ చదవండి: ఆలయ భూములను కూడా వదలని భూకబ్జాదారులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.