ETV Bharat / state

పరివర్తన 2.0.. మారిన కప్పరాల తిప్ప గ్రామం

villagers stopped making natusara: ఏపీలో నాటుసారా, దొంగతనాలకు అలవాటుపడ్డ ఆ గ్రామ ప్రజలను పోలీసులు సక్రమ మార్గంలో పెట్టారు. ఉపాధి లేక, ప్రభుత్వాలు సైతం పట్టించుకోని తరుణంలో కుటుంబ పోషణకు అడ్డదారులు తొక్కిన వారిని మార్చారు. వీరి మార్పుపై శ్రద్ధపెట్టిన పోలీసులు, ఎస్​ఈబీ అధికారులు పరివర్తన 2.O పేరుతో రుణసాయం అందించి బతుకుల్లో మార్పు తెచ్చారు.

villagers stopped making natusara
నెల్లూరు జిల్లాలో నాటు సార
author img

By

Published : Dec 11, 2022, 7:25 PM IST

villagers stopped making natusara: నెల్లూరు జిల్లాలో ఒకప్పుడు నాటుసారాకు, దొంగలకు పేరొందిన గ్రామం కప్పరాల తిప్ప. అక్కడి కుటుంబాలను మార్చేందుకు ప్రభుత్వాలు అనేక ప్రయత్నాలు చేశాయి. పోలీసులు, ఎక్సైజ్‌ అధికారులు వారిపై అనేక కేసులు పెట్టారు. పదేళ్లుగా ఎన్ని చర్యలు తీసుకున్నా ఫలితం లేదు. కొందరు పిల్లలు విద్యపై దృష్టి పెట్టటంతో కొంత మార్పు వచ్చింది. ఇంకా అదే వృత్తిలో ఉన్న కొంతమంది తమకు ప్రత్యామ్నాయ ఉపాధి కల్పిస్తే తాము కూడా మారతామంటున్నారు. గ్రామంలో చదువుకున్న విద్యార్థులకు సైతం ఉద్యోగావకాశాలు కల్పించాలని విన్నవించుకుంటున్నారు. ప్రభుత్వం అందిస్తున్న రుణాలతో తమ కష్టాలు తీరవని.. ఉపాధి కల్పించాలని వేడుకుంటున్నారు.

పరివర్తన 2.0.. మారిన కప్పరాల తిప్ప గ్రామం

ప్రభుత్వ సహకారంతో పోలీసులు కుటుంబానికి లక్ష రూపాయల చొప్పున రుణ సాయం అందించారు. దీంతో లబ్ధి పొందిన 24 కుటుంబాల వారు దుకాణాలు ఏర్పాటు చేసుకున్నారు. కరోనా కాలంలో తీవ్ర ఇబ్బందులు పడ్డామని.. రుణానికి వడ్డీ మాత్రం చెల్లించలేమని లబ్ధిదారులు చెబుతున్నారు. రుణాన్ని సక్రమంగా ఉపయోగించి వాటితో ఉపాధి ఏర్పాటు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

నేరచరిత్ర ఉన్న గ్రామాల్లో పరివర్తన రావాలంటే యువతలో మార్పు రావాలని పోలీసులు అంటున్నారు. శిక్షణా కేంద్రాలు ఏర్పాటు చేసి ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నారు. పేద పిల్లలు ఉన్నత చదువులు చదివేలా ప్రోత్సహిస్తున్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.