Kanuma Festival Celebrations in Telangana : పండుగ సందర్భంగా పలు గోశాలల్లో భక్తులు గోమాతకు పూజలు నిర్వహించారు. జగిత్యాల జిల్లా తాటిపల్లి సురబి గోశాల, రాయికల్ గోశాలలో ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఎమ్మెల్సీ టి.జీవన్‌రెడ్డి గోమాతలకు పూజలు నిర్వహించారు. ఇంటికో గోమాతను పెంచుకుంటే ఆధ్యాత్మికతో పాటు, గోవు పాల ఉత్పత్తి ఉంటుందని జీవన్ అభిప్రాయం వ్యక్తం చేశారు. గోశాలకు తన వంతు సాయం అందిస్తామన్నారు.
Karimnagar Kanuma Celebrations : ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడలోని బద్ది పోచమ్మ ఆలయంలో మంగళవారం భక్తుల రద్దీ నెలకొంది. బోనాలతో ఆలయానికి వచ్చిన భక్తులు అమ్మవారికి నైవేద్యం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్ర స్వామిని కేంద్రమంత్రి బీఎల్ వర్మ దర్శించుకున్నారు. ఆలయం వద్దకు వచ్చిన మంత్రికి అధికారులు మంగళ వాయిద్యాలతో ఘన స్వాగతం పలికి ఆలయంలోనికి ఆహ్వానించారు. అనంతరం ప్రధానాలయంలోని సీతారాముల ఎదుట ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చకులు శాలువాతో సత్కరించి ఆశీర్వదించారు.
రాజ్‌భవన్‌లో ఘనంగా కనుమ వేడుకలు
కనుమ పర్వదినం సందర్భంగా జగిత్యాల గ్రామీణ మండలం తాటిపల్లి సురబి గోశాలలో, రాయికల్‌లోని గోశాలలో గోమాత పూజలు నిర్వహించారు. ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, ఎమ్మెల్సీ టి. జీవన్‌రెడ్డి గోమాతలకు పూజలు చేశారు. ఇంటికో గోమాతను పెంచుకుంటే ఆద్యాత్మికతతోపాటు, గోవుపాల ఉత్పత్తి పెరుగుతుందని జీవన్‌రెడ్డి అన్నారు. గోశాలకు తనవంతు సాయం అందిస్తామని తెలిపారు.
కనుమ సందడి.. కిటకిటలాడిన మాంసం దుకాణాలు.. కనిపించని భౌతికదూరం
TTD Kanuma Festival : మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని శ్రీ వేణుగోపాల స్వామి ఆలయంలో టీటీడీ ఆధ్వర్యంలో గోపూజ కార్యక్రమాన్ని నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని గోవులకు పూజలు చేశారు. ఈ సందర్భంగా టీటీడీ ధర్మ ప్రచార సభ సభ్యుడు రాములు మాట్లాడారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో కనుమ పండుగ సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానం హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో అన్ని జిల్లా కేంద్రాల్లో గో పూజా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారని తెలిపారు. గోవుల్లో సకల దేవతలుంటారని, వాటిని పూజిస్తే వారందరిని పూజించినట్లేనని, టీటీడీ వారు ప్రతీ సంవత్సరం కనుమ రోజు నిర్వహిస్తరని అన్నారు.
Kanuma: కనుమ.. పాడిపంటలు, పశువులతో రైతన్న అనుబంధాన్ని ఆవిష్కరించే పండుగ
జగిత్యాల జిల్లా ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండగట్టు అంజన్న ఆలయానికి భక్తులు పోటెత్తారు. మంగళవారం కావటం, సంక్రాంతి సెలవులు ముగియనుండటంతో రాష్ట్ర నలుమూలల నుంచి భారీ సంఖ్యలో భక్తులు తరలి వచ్చారు. దీంతో ఆలయ ప్రాంగణమంతా కిటకిటలాడింది. స్వామివారి దర్శనానికి సుమారు రెండు గంటల సమయం పట్టింది.