మత్స్య కార్మిక సంఘం నగర అధ్యక్షురాలు, హైదరాబాద్ మత్స్య సొసైటీ డైరెక్టర్ కన్నం తులసి గంగపుత్ర అకాల మరణం... మత్స్యకారులకు తీరని లోటని వృత్తి సంఘాల రాష్ట్ర నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. గత రెండు దశాబ్దాలుగా మత్స్యకారుల కోసం ఎన్నో పోరాటాలు చేశారని సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లెల్లెల బాలకృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు.

వారసిగూడ చౌరస్తాలోని తులసి స్వగృహంలోని భౌతికకాయానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. మత్స్యకారులను ఐక్యం చేయటంలో తులసి కీలక పాత్ర పోషించారని మాజీ ఎమ్మెల్సీ చెరుపల్లి సీతారాములు అన్నారు.

తులసి భౌతికకాయాన్ని సందర్శించి శ్రద్ధాంజలి ఘటించిన వారిలో ప్రదేశ్ గంగపుత్ర సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఏఎల్ మల్లయ్య, జిల్లా మత్స్యశాఖ అధికారి రాజారాం, మత్స్య కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు చనమోని శంకర్, ముఠా విజయ్, రాష్ట్ర కార్యదర్శులు కరెల్లి లలిత, గోరింకల, రాష్ట్ర కమిటీ సభ్యురాలు పూస నాగమణి తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: 'హైదరాబాద్ మత్స్య సొసైటీ డైరెక్టర్ తులసి గంగపుత్ర కన్నుమూత'