అంబర్పేట నియోజకవర్గ పరిధిలో ఏర్పాటు చేసిన కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ పాల్గొన్నారు. 85 మంది లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశ పెట్టిన ఈ సంక్షేమ పథకాలు ఎంతోమంది పేదింటి ఆడబిడ్డలకు తోడ్పాటు అందిస్తున్నాయన్నారు. కేసీఆర్ ప్రవేశపెట్టిన రైతుబంధు పథకాన్ని నరేంద్ర మోదీ ప్రభుత్వం కాపీ కొట్టిందని ఎద్దేవా చేశారు. కేసీఆర్ని విమర్శించడం వల్ల బీజేపీ నేతలు తమ నైతికతను కోల్పోతున్నారని ఎమ్మెల్యే పేర్కొన్నారు. భాజపా నేతలకు తెలంగాణపై చిత్తశుద్ధి ఉంటే కాళేశ్వరం లాంటి ప్రాజెక్టుకు కేంద్రం నుంచి నిధులు రాబట్టాలంటూ దుయ్యబట్టారు.
ఇదీ చూడండి:- 'ఎప్పుడు రావాలి..?'- కశ్మీర్ గవర్నర్కు రాహుల్ ట్వీట్