తెలంగాణ రాష్ట్రం ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాల అమలులో దేశానికే ఆదర్శంగా నిలిచిందని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. హైదరాబాద్ వెస్ట్ మారేడ్‌పల్లిలోని తన నివాసంలో లబ్ధి దారులకు కల్యాణలక్ష్మి చెక్కులను కార్పొరేటర్ నామన శేషుకుమారితో కలిసి ఆయన అందజేశారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజల కోసం అనేక కార్యక్రమాలు అమలు చేస్తుందని తెలిపారు. పేదింటి ఆడపడుచుల వివాహానికి రూ. లక్షా 116 ఆర్థిక సహాయం అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని అన్నారు. ఈ కార్యక్రమంలో అమీర్‌పేట తహసీల్దార్ చంద్రకళ, డివిజన్ నాయకులు కూతురు నర్సింహ, కట్టా బలరాం తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి: ఇంటి నుంచి బయటకు వెళ్లిన యువతి... చివరకు శవమై!