ETV Bharat / state

ఎమ్మెల్యే పేరుతో ఫేస్​బుక్ నకిలీ ఖాతా.. - ఏపీ తాజా వార్తలు

సైబర్​ నేరగాళ్లు ఎప్పటికప్పుడు కొత్త తరహా మోసాలకు పాల్పడుతున్నారు. సామాజిక మాధ్యమాల్లో నకిలీ ఖాతాలు సృష్టించి.. ఏదో ఒక కారణం చెప్పి.. నగదు కావాలంటూ సందేశాలు పంపిస్తున్నారు. ప్రజాప్రతినిధులకు సైతం ఈ సమస్య ఎదురవుతోంది. ఎమ్మెల్యే పేరుతో నకిలీ అకౌంట్​ తెరిచి మనీ డిమాండ్​ చేసిన ఘటన ఆంధ్రప్రదేశ్​ తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో జరిగింది.

kakinada
ఎమ్మెల్యే పేరుతో ఫేస్​బుక్ నకిలీ ఖాతా.. ఎస్పీకి ఫిర్యాదు
author img

By

Published : Mar 16, 2021, 10:01 AM IST

సామాజిక మాధ్యమం ఫేస్​బుక్​లో.. ఏపీ తూర్పు గోదావరి జిల్లా కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పేరుతో నకిలీ ఖాతా తెరిచారు.. సైబర్ నేరగాళ్లు. ఆ ఖాతా నుంచి.. ఎమ్మెల్యే పేరుతో ఇతరులకు సందేశాలు పంపించారు. రూ. 15 వేలు డిపాజిట్ చేయాలంటూ మెసేజ్​లు పంపారు.

ఈ విషయాన్ని గుర్తించిన ఎమ్మెల్యే ద్వారంపూడి.. జిల్లా ఎస్పీ నయీం అద్నాం అస్మీకి ఫిర్యాదు చేశారు. నిందితులపై చర్యలు తీసుకోవాలని కోరారు. కాకినాడ రెండో పట్టణ పోలీస్​ స్టేషన్​లో కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

ఇదీ చదవండి: వైద్యుల నిర్లక్ష్యంతో మహిళ మృతి.. పరిహారానికి రెండు దశాబ్దాలు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.