ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లా కచ్చులూరు వద్ద జరిగిన బోటు ప్రమాదంలో వెలికితీసిన మృతదేహాల గుర్తింపు ప్రక్రియ కొనసాగుతోంది. రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆస్పత్రిలో మొత్తం 8 మృతదేహాలు ఉండగా... డ్రైవర్ నూకరాజు, వరంగల్ అర్బన్ జిల్లా కడిపికొండ వాసులు కొమ్ముల రవి, బసికే ధర్మరాజు మృతదేహాలను వారి కుటుంబ సభ్యులు గుర్తించారు. మరో 5 మృతదేహాలను గుర్తించాల్సి ఉంది.
ఇవీ చూడండి: భారీ వర్షాలకు నీట మునిగిన సావదత్తి ఎల్లమ్మ దేవాలయం