ETV Bharat / state

Kacheguda Yesvantpur Vande Bharat Express : హైదరాబాద్​ టు బెంగళూరుకు​ వందేభారత్.. నేడు ప్రారంభించనున్న ప్రధాని మోదీ - హైదరాబాద్ యశ్వంతపూర్‌ వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్

Kacheguda Yesvantpur Vande Bharat Express : తెలంగాణలో మూడో వందేభారత్‌ రైలు పరుగులు పెట్టనుంది. కాచిగూడ-యశ్వంతపూర్‌ మధ్య నడిచే వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ను ప్రధాని మోదీ నేడు వర్చువల్‌గా ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమంలో గవర్నర్‌ తమిళిసై, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి పాల్గొననున్నారు.

HYDERABAD TO BANGALORE VANDE BHARAT EXPRESS
Kacheguda Yesvantpur Vande Bharat Express
author img

By ETV Bharat Telangana Team

Published : Sep 24, 2023, 5:58 AM IST

Kacheguda Yesvantpur Vande Bharat Express : తెలంగాణ ప్రజలకు కేంద్రప్రభుత్వం మరో శుభవార్తను తెలిపింది. తెలంగాణ నుంచి మూడో వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌ను ప్రారంభించబోతోంది. దేశంలో ఏ రాష్ట్రానికి లేని ప్రాధాన్యత తెలంగాణకు దక్కింది. ఇప్పటికే సంక్రాంతి కానుకగా.. సికింద్రాబాద్-విశాఖపట్టణం వందేభారత్ రైలు, ఉగాది కానుకగా సికింద్రాబాద్-తిరుపతి వందేభారత్ రైలును కేంద్రం ప్రారంభించగా.. ఇప్పుడు వినాయక నవరాత్రుల కానుకగా.. నేడు కాచిగూడ-బెంగళూరు వందే భారత్ రైలును ప్రారంభించనుంది.

కూతపెట్టిన సికింద్రాబాద్​- తిరుమల వందేభారత్ రైలు.. జెండా ఊపి ప్రారంభించిన మోదీ

HYDERABAD TO BANGALORE VANDE BHARAT EXPRESS : తెలంగాణ నుంచి మూడో వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌ నేడు ప్రారంభం కానుంది. మధ్యాహ్నం 12.30 గంటలకు కాచిగూడలో ఈ రైలు ప్రారంభోత్సవ కార్యక్రమం జరగనుంది. దిల్లీ నుంచి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈ రైలును వర్చువల్‌గా ప్రారంభించనున్నారు. రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర రాజన్, కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి కాచిగూడ నుంచి ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు.

వందే భారత్ రైలు.. సౌకర్యాలు ఎలా ఉంటాయో చూద్దామా..!

3rd Vande Bharat Train in Telangana : నేడు ప్రారంభించనున్న ఈ రైలు.. బుధవారం మినహా ప్రతిరోజు కాచిగూడ నుంచి ఉదయం 5.30 గంటలకు బయలుదేరుతుంది. మహబూబ్‌ నగర్, కర్నూల్ సిటీ, అనంతపూర్ స్టేషన్‌లలో ఆగుతూ.. యశ్వంత్‌పూర్‌కు మధ్యాహ్నం 2.15 చేరుకుంటుంది. మధ్యాహ్నం 3 గంటలకు యశ్వంత్‌పూర్‌ నుంచి బయలుదేరి.. అనంతపూర్, కర్నూల్ సిటీ, మహబూబ్‌ నగర్ స్టేషన్‌లలో ఆగుతూ.. రాత్రి 11.15 గంటలకు కాచిగూడ చేరుకుంటుందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఆదివారం ఒక్కరోజు మాత్రం.. మధ్యాహ్నం 12.30కి కాచిగూడ నుంచి బయలుదేరి ఫలక్‌నుమా, ఉందానగర్, షాద్‌నగర్, జడ్చర్ల, మహబూబ్‌నగర్, దేవరకద్ర, గద్వాల్, కర్నూల్ సిటీ, డోన్, పెండేకల్లు జంక్షన్, గుత్తి, కల్లూరు, అనంతపూర్, ధర్మవరం జంక్షన్, పెనుగొండ, రంగేపల్లి, హిందూపూర్, తొండెబావి, యలహంక జంక్షన్, లొట్టేగొల్లహల్లి మీదుగా యశ్వంత్‌పూర్ చేరుకుంటుంది.

ప్రధాని హైదరాబాద్ పర్యటన.. రూ.11వేల కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం

3rd Vande Bharat Train Starts Today in Telangana : మూడో వందే భారత్ రైలు 12 జిల్లాల గుండా వెళ్తుంది. తెలంగాణలోని హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్, వనపర్తి, జోగులాంబ గద్వాల జిల్లాలు, ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు, నంద్యాల, అనంతపూర్, శ్రీ సత్యసాయి జిల్లాలు, కర్ణాటక-చిక్‌ బళ్లాపూర్, బెంగళూరు రూరల్ మీదుగా ప్రయాణిస్తుంది. దీని సగటు వేగం గంటకు 71.74 కిలోమీటర్లతో దూసుకుపోనుంది. గతంలో ఈ దూరం ప్రయాణించేందుకు పట్టే సమయం 11.20 గంటలు కాగా.. వందే భారత్ రైలుతో 8.30 గంటల్లో ప్రయాణించవచ్చని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఈ మార్గంలో ఉన్నటువంటి ప్రముఖ పర్యాటక కేంద్రాలు.. సమతామూర్తి (స్టాచూ ఆఫ్ ఈక్వాలిటీ), గోల్గొండ కోట, చార్మినార్, గద్వాల్ కోట, శ్రీశైలం (కర్నూలు సమీపంలో) సత్యసాయి ప్రశాంతి నిలయం (అనంతపూర్), బెంగళూరులోని పర్యాటక కేంద్రాలు, దేశ ఐటీ రాజధాని, స్టార్టప్ రాజధానులను ఈ రైలు అనుసంధానం చేస్తోంది.

‘వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌’.. విశేషాలివే..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.