ETV Bharat / state

ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన వారిపై రూ.3 వేల కోట్ల ఫైన్​ విధించాలి: కేఏ పాల్​ - కేఏ పాల్​ తాజా వార్తలు

KA Paul on Flexies: నగరంలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన వారిపై 3 వేల కోట్ల రూపాయల ఫైన్​లు విధించి.. వారిని చట్టబద్ధంగా శిక్షించాలని ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ డిమాండ్ చేశారు. వేల కోట్ల ప్రజా సొమ్మును తెరాస పార్టీ నేతలు దుర్వినియోగం చేస్తున్నారని​ ఆగ్రహం వ్యక్తం చేశారు. నడిరోడ్డుపై ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి ట్రాఫిక్​కు అంతరాయం కలిగించొచ్చా?.. వేల కోట్లను వృథా చేయొచ్చా అని ఆయన ప్రశ్నించారు.

ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన వారిపై 3 వేల కోట్ల ఫైన్​ విధించాలి: కేఏ పాల్​

author img

By

Published : Apr 27, 2022, 2:58 PM IST

KA Paul on Flexies: వేల కోట్ల ప్రజా సొమ్మును తెరాస పార్టీ నేతలు దుర్వినియోగం చేస్తున్నారని ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్​ ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో నగరంలో ఎక్కడైనా ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తే చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని చెప్పిన కేటీఆర్​.. ఇప్పుడు తెరాసకు సంబంధించిన వేల ఫ్లెక్సీలు రోడ్లపై దర్శనమిస్తుంటే ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. ఏ ఇతర పార్టీలు ఎందుకు ఈ విషయాన్ని ఖండించలేదని పాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

తాను అమెరికాలో 33 ఏళ్లు ఉండి బిల్​ క్లింటన్​, బిల్​గేట్స్​తో పాటు బిలియనీర్లను పంపించి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్​ను అభివృద్ధి చేశానని కేఏ పాల్​ వెల్లడించారు. కానీ కేసీఆర్​, కేటీఆర్​ల అవినీతికి ఈ ఫ్లెక్సీలే రుజువు అని ఆయన ఆరోపించారు. తెరాసకు కోటి రూపాయలు లేనప్పుడు కేసీఆర్​ తనను కలిస్తే.. ఆ పార్టీ కోసం తాను ప్రమోట్​ చేశానని పాల్​ వెల్లడించారు. నడిరోడ్డుపై ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి ట్రాఫిక్​కు అంతరాయం కలిగించొచ్చా?.. వేల కోట్లను వృథా చేయొచ్చా.. అని ఆయన ప్రశ్నించారు. జీహెచ్​ఎంసీ కమిషనర్​కు ఫిర్యాదు చేద్దామని వెళ్తే.. తనను కలవకుండా కమిషనర్​ను కేటీఆర్​ పిలిపించుకున్నారని పాల్​ ఆరోపించారు.

తాను 33 ఏళ్లు అమెరికాలో ఉండి అభివృద్ధి చేయబట్టే.. వందల వేల బిలియనీర్లను ఇక్కడికి రప్పించినందుకే.. అప్పటి ముఖ్యమంత్రులు చంద్రబాబు, రాజశేఖర్​ రెడ్డితో పాటు పీవీ నరసింహరావు, రాజీవ్​ గాంధీ వందనాలు చెప్పారన్నారు. ప్రస్తుతం డబ్బు లేక రైతులు, నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆయన అన్నారు. మరి వీరికి ఎక్కడి నుంచి వందల వేల కోట్లు వస్తున్నాయని కేఏ పాల్​ ప్రశ్నించారు. ఈ సందర్భంగా కేఏ పాల్​ మూడు డిమాండ్లు చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్​ రాజీనామా చేసి దళితుడిని సీఎం చేయాలని పాల్ డిమాండ్ చేశారు. ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన వారిపై 3 వేల కోట్ల రూపాయల ఫైన్​ విధించి.. వారిని చట్టబద్ధంగా శిక్షించాలని పాల్ డిమాండ్ చేశారు.

వేల కోట్ల ప్రజా సొమ్మును తెరాస పార్టీ నేతలు దుర్వినియోగం చేస్తున్నారు. కేసీఆర్​, కేటీఆర్​ల అవినీతికి ఈ ఫ్లెక్సీలే రుజువు. నడిరోడ్డుపై ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి ట్రాఫిక్​కు అంతరాయం కలిగించొచ్చా?.. వేల కోట్లను వృథా చేయొచ్చా?. ఏ ఇతర పార్టీలు ఎందుకు ఈ విషయాన్ని ఖండించలేదు. నేను ఈ సందర్భంగా మూడు డిమాండ్లు చేస్తున్నా. ముఖ్యమంత్రి కేసీఆర్​ రాజీనామా చేసి దళితుడిని సీఎం చేయాలి. ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన వారిపై 3 వేల కోట్ల రూపాయల ఫైన్​ విధించాలి. వారిని చట్టప్రకారం పోలీసులు అరెస్ట్​ చేసి క్షమాపణ చెప్పేవరకు వదిలేయకూడదు. -కేఏ పాల్​, ప్రజాశాంతి పార్టీ అధినేత

ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన వారిపై రూ.3 వేల కోట్ల ఫైన్​ విధించాలి

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.