ETV Bharat / state

ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణం చేయనున్న జస్టిస్​ జితేంద్ర కుమార్ మహేశ్వరి

రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్​ జితేంద్ర కుమార్​ మహేశ్వరి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఉదయం 10.30 గంటలకు రాష్ట్ర గవర్నర్​ బిశ్వభూషణ్​ హరిచందన్​ ఆయనతో ప్రమాణం చేయించనున్నారు.

ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి..
author img

By

Published : Oct 7, 2019, 7:14 AM IST

Updated : Oct 7, 2019, 7:31 AM IST

​ ఆంధ్రప్రదేశ్​ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ జితేంద్రకుమార్ మహేశ్వరి ఇవాళ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఉదయం 10.30 గంటలకు ఏపీ గవర్నర్​ బిశ్వభూషణ్​ హరిచందన్​ ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. ఈ కార్యక్రమానికి ఏపీ సీఎం జగన్మోహన్​రెడ్డి​ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు.

విభజన తర్వాత తొలి ప్రధాన న్యాయమూర్తి...

విభజన అనంతరం మొదటిసారి శాశ్వత ప్రధాన న్యాయమూర్తిగా ఆయన పదవీ బాధ్యతలు స్వీకరించనున్నారు. ప్రస్తుతం మధ్యప్రదేశ్​లో సీనియర్​ న్యాయమూర్తిగా పనిచేస్తోన్న జితేంద్ర కుమార్​ను ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా నియమిస్తూ కేంద్ర న్యాయ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. 1961 జూన్​ 21న జన్మించిన జితేంద్ర కుమార్​ మహేశ్వరి 1985 నవంబరు 22న న్యాయవాదిగా నమోదయ్యారు. మధ్యప్రదేశ్​ హైకోర్టులోనే కొంతకాలం సివిల్​, క్రిమినల్​, రాజ్యాంగ వ్యవహారాల న్యాయవాదిగా పనిచేశారు. 2005లో మధ్యప్రదేశ్ హైకోర్టులో న్యాయమూర్తిగా నియమితులై... మూడేళ్ల తర్వాత శాశ్వత న్యాయమూర్తి అయ్యారు.

ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్​ జితేంద్ర కుమార్

ఇదీ చూడండి: 'ఎస్వీఆర్ తెలుగువాడిగా పుట్టడం మన అదృష్టం'

Intro:ap_knl_31_06_dasara_utsavalu_av_ap10130 కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా శ్రీకన్యకాపారమేశ్వరి దేవి ఆలయం, చేనేత మైదానంలో అమ్మవారు దుర్గాదేవి అలంకరణ లో భక్తులకు దర్శనమిచ్చారు. తేరుబజారు లో కాళికదేవి అలంకరణ చేశారు.సోమిరెడ్డి, రిపోర్టర్, ఎమ్మిగనూరు, కర్నూలు జిల్లా,8008573794.

Body:దసరా

Conclusion:ఉత్సవాలు
Last Updated : Oct 7, 2019, 7:31 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.