ETV Bharat / state

లోకాయుక్తగా జస్టిస్‌ వెంకటరాములు.. హెచ్​ఆర్సీ ఛైర్మన్​గా జస్టిస్ చంద్రయ్య

author img

By

Published : Dec 19, 2019, 7:30 PM IST

Updated : Dec 19, 2019, 10:51 PM IST

లోకాయుక్త, మానవహక్కుల సంఘం ఛైర్మన్, సభ్యుల ఎంపిక ప్రక్రియ పూర్తైంది. లోకాయుక్తగా ఉమ్మడి హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ సీవీ రాములును ప్రభుత్వం నియమించింది. మానవ హక్కుల కమిషన్ ఛైర్మన్​గా హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ చంద్రయ్య నియమితులయ్యారు.

లోకాయుక్త జస్టిస్‌ వెంకటరాములు..
లోకాయుక్త జస్టిస్‌ వెంకటరాములు..

తెలంగాణ లోకాయుక్త, ఉప లోకాయుక్త, మానవ హక్కుల కమిషన్ ఛైర్మన్, సభ్యులను ప్రభుత్వం నియమించింది. లోకాయుక్తగా ఉమ్మడి హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ సీవీ రాములును నియమించింది. ఉపలోకాయుక్తగా విశ్రాంత జిల్లా జడ్జి, ప్రభుత్వ న్యాయ శాఖ మాజీ కార్యదర్శి జి.నిరంజన్ రావు పేరు సిఫార్సు చేయగా గవర్నర్ తమిళిసై ఆమోదించారు.

మానవ హక్కుల కమిషన్ ఛైర్మన్​ జస్టిస్ చంద్రయ్య

మానవ హక్కుల కమిషన్ ఛైర్మన్​గా హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ చంద్రయ్య నియమితులయ్యారు. సభ్యులుగా ఎన్. ఆనందరావు, మొహమద్ ఇర్ఫాన్ మొయినుద్దీన్ పేర్లను గవర్నర్ ఆమోదించారు.

సుదీర్ఘ చర్చ...అనంతరం ఎంపిక

లోకాయుక్త, ఉప లోకాయుక్త, హెచ్ఆర్ సీ ఛైర్మన్, సభ్యుల నియామకం కోసం ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధ్యక్షతన కమిటీ సమావేశం జరిగింది. కమిటీ సభ్యులుగా ఉన్న శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, అసెంబ్లీ, మండలీలో విపక్ష నాయకులు పాషా ఖాద్రీ, జాఫ్రీ హాజరయ్యారు.సుదీర్ఘంగా చర్చించి ఎంపిక ప్రక్రియ పూర్తి చేశారు.

ఇవీచూడండి: హైదరాబాద్​లో 'పౌర' సెగ: వామపక్ష నేతల అరెస్ట్

File : TG_Hyd_58_19_Lokayuktha_HRC_Comitees_Dry_3053262 From : Raghu Vardhan ( ‌) లోకాయుక్త, మానవహక్కుల సంఘం సభ్యుల ఎంపిక ప్రక్రియ పూర్తైంది. ఎంపిక కమిటీలు ప్రగతి భవన్ లో సమావేశమయ్యాయి. లోకాయుక్త ఎంపిక కమిటీ సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్, మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, శాసనసభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి, మజ్లిస్ ఎమ్మెల్యే పాషాఖాద్రీ, ఎమ్మెల్సీ సయ్యద్ అమీనుల్ జాఫ్రి పాల్గొన్నారు. మానవహక్కుల సంఘం సభ్యుల ఎంపిక కమిటీలో అదనంగా హోంమంత్రి మహమూద్ అలీ కూడా పాల్గొన్నారు. లోకాయుక్తగా విశ్రాంత హైకోర్టు న్యాయమూర్తిని, ఉపలోకాయుక్తగా విశ్రాంత జిల్లా న్యాయమూర్తిని ఎంపిక చేయనున్నారు. మానవహక్కుల సంఘం సభ్యులుగా విశ్రాంత హైకోర్టు న్యాయమూర్తితో పాటు మరొకరిని ఎంపిక చేయనున్నారు.
Last Updated : Dec 19, 2019, 10:51 PM IST

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.