ETV Bharat / state

'ఈ పరిస్థితుల్లో పరీక్షలు రాయలేం.. వాయిదా వేయండి' - పీజీ పరీక్షలు వాయిదా వేయాలంటున్న జుడాలు

వైద్యవిద్య పీజీ పరీక్షలు త్వరలో జరగనున్న తరుణంలో... పరీక్షలను వాయిదా వేయాలన్న డిమాండ్లు రోజురోజుకీ పెరుగుతున్నాయి. రాష్ట్రంలో 3 నెలలుగా జూనియర్‌ డాక్టర్లు కొవిడ్ సేవల్లో నిమగ్నమయ్యారు. పలువురు విద్యార్థి వైద్యులు వైరస్​ బారిన పడి చికిత్స పొందుతున్నారు. ఇలాంటి సమయంలో పీజీ పరీక్షలు రాయటం కష్టమని భావిస్తున్నారు. ఉస్మానియా వైద్య కళాశాలకు చెందిన ఓ వైద్య విద్యార్థి... ఏకంగా గవర్నర్‌కి లేఖ రాసి గోడు వెళ్ల బోసుకున్నారు.

Junior doctors says that Can't write Exams in this situation
పరీక్షలు రాయలేం.. వాయిదా వేయండి
author img

By

Published : Jun 13, 2020, 10:08 PM IST

పరీక్షలు రాయలేం.. వాయిదా వేయండి

ప్రభుత్వాస్పత్రులు పూర్తిగా కరోనా సేవల్లో నిమగ్నమయ్యాయి. ముఖ్యంగా గాంధీ ఆస్పత్రి... 3నెలలుగా పూర్తిగా కొవిడ్ చికిత్సకే అంకితమైంది. గాంధీలో పనిచేస్తున్న జూనియర్‌ డాక్టర్లలో 200 మందికిపైగా పీజీ చివరి సంవత్సరం చదువుతున్నారు. జీహెచ్​ఎంసీ పరిధిలో సుమారు 1,500 వరకు వైద్య విద్యార్థులు... ఈనెల 20 నుంచి జరగనున్న పీజీ పరీక్షలకు హాజరు కావాల్సి ఉంది. రాష్ట్రవ్యాప్తంగా 3 వేల 500 మంది వరకు వైద్య విద్యార్థులు.. ఈ పరీక్షలకు హాజరుకానున్నారు. రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతుండటం... కొంత కాలంగా కొవిడ్ సేవలకే తాము పరిమితమైన నేపథ్యంలో పరీక్షలను వాయిదా వేయాలని వైద్య విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు.

ఈ పరిస్థితుల్లో రాయలేం!

ఇటీవలి కాలంలో వైద్య విద్యార్థుల్లోనూ... పలువురికి కరోనా సోకిందని... ఇలాంటి పరిస్థితుల్లో పరీక్షలు రాయలేమని తమకు సహాయం చేయాలని కోరుతున్నారు. 3నెలలుగా రోజుకి దాదాపు 12 గంటలపాటు వైద్య సేవల్లో కొనసాగటం వల్ల చదువుకునేందుకు సమయం లేదన్నది వైద్య విద్యార్థుల వాదన. ఉస్మానియాకు చెందిన ఓ వైద్య విద్యార్థి... పరీక్షలను వాయిదా వేయాలని కోరుతూ గవర్నర్‌కి లేఖ రాశారు. తనకు కొవిడ్‌ సోకి గాంధీలోనే చికిత్స పొందుతున్నానని.. ఒకటి, రెండు రోజుల్లో డిశ్చార్జ్ కానున్నట్టు పేర్కొన్నారు. ఐసీఎంఆర్ నిబంధనల ప్రకారం డిశ్చార్జ్ అయిన తర్వాత కూడా 14 రోజుల పాటు... హోం క్వారంటైన్‌లో ఉండాల్సి ఉంటుంది. ఈ కారణంగా తాను 20నుంచి ప్రారంభంకానున్న పరీక్షల్లో మొదటి, రెండు రాయలేకపోతానని ఆవేదన చెందారు.

విముఖత... గవర్నర్ ఎలా స్పందిస్తారో!

గాంధీకి చెందిన మరి కొంత మంది విద్యార్థులు... ఉపకులపతికి సైతం పరీక్షలను కొంతకాలం ఆపాలని కోరుతూ ఈ-మెయిళ్లు పంపారు. దీనిపై వైద్య ఆరోగ్య శాఖ విముఖత చూపుతోంది. కాళోజీ వర్సిటీ ఉపకులపతి కరుణాకర్ రెడ్డి... వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల సైతం పరీక్షలను వాయిదా వేసే ఉద్దేశం లేదని పేర్కొనటం విద్యార్థులను మరింత ఆందోళనకు గురి చేస్తోంది. వృత్తి రీత్యా వైద్యురాలిగా... రాష్ట్ర ప్రథమ మహిళగా... గవర్నర్‌ తమిళిసై తమ సమస్యలపై ఎలా స్పందిస్తారోనని వైద్య విద్యార్థులు ఎదురుచూస్తున్నారు.

ఇవీ చూడండి: తెలంగాణలో కొత్తగా 253 మందికి కరోనా... 4,737కు చేరిన కేసులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.