దేశవ్యాప్తంగా ఎన్ఎంసీ బిల్లుకు వ్యతిరేకంగా జూడాలు తమ గళం వినిపిస్తుండగా... తెలంగాణలో జూడాలు వినూత్నరీతిలో ఆందోళన చేశారు. హైదరాబాద్‌లో వైద్యులు చేపడుతున్న ధర్నాలో బతుకమ్మని భాగం చేశారు. రాష్ట్ర సాధనలో కీలక పాత్ర పోషించిన ప్రకృతి పండుగ బతుకమ్మకు స్టెతస్కోప్ వేసి నిరసన తెలిపారు. ఎన్ఎంసీ బిల్లు వల్ల వచ్చే సమస్యలు ప్రతిధ్వనించేలా తామే స్వయంగా రాసుకున్న పాటను లయబద్ధంగా పాడుతూ... బతుకమ్మ ఆటలు ఆడారు.
ఇదీ చూడండి : ఆచార్య జయశంకర్‌ను ఆదర్శంగా తీసుకోవాలి: కేటీఆర్