ETV Bharat / state

అక్బరుద్దీన్‌పై కేసుల్లో నేడే తీర్పు.. పాతబస్తీలో అదనపు బందోబస్తు - case against mim mla akbaruddin

ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ ప్రసంగం కేసులో నేడు తీర్పు వెలువడే అవకాశముంది. నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టులో కేసు విచారణ ముగిసింది. 30 మందికి పైగా సాక్షులను న్యాయస్థానం విచారించింది. తీర్పు దృష్ట్యా పాతబస్తీలో అదనపు బందోబస్తును పోలీసులు ఏర్పాటు చేశారు.

judgment today in the case against mim mla akbaruddin
అక్బరుద్దీన్‌పై కేసుల్లో నేడే తీర్పు.. పాతబస్తీలో అదనపు బందోబస్తు
author img

By

Published : Apr 13, 2022, 8:14 AM IST

మత విద్వేషాలు రెచ్చగొట్టేలా ప్రసంగించారని ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌పై నమోదైన కేసులకు సంబంధించి నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టులో ఇవాళ తీర్పు వెలువడనుంది. ఈ నేపథ్యంలో నగరంలోని పాతబస్తీలో పోలీసులు అదనపు బందోబస్తు ఏర్పాటు చేశారు. నిర్మల్‌, నిజామాబాద్‌ జిల్లాల్లో తొమ్మిదేళ్ల క్రితం మత విద్వేషాలు రెచ్చగొట్టేలా ప్రసంగించారని అక్బరుద్దీన్‌పై పోలీసులు 153ఏ, 295ఏ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. దీనిపై ప్రజాప్రతినిధుల కోర్టులో విచారణ ముగిసింది. విచారణ సందర్భంగా న్యాయస్థానం 30మందికి పైగా సాక్షులను విచారించింది. మరోవైపు ప్రసంగంలోని గొంతు అక్బరుద్దీన్‌దే అని ఫొరెన్సిక్‌ సైన్స్‌ ల్యాబొరేటరీ తేల్చిన విషయం తెలిసిందే.

ఇవీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.