ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాకపై జూనియర్ ఎన్టీఆర్ స్పందించారు. ఓ టీవీ ఛానల్లో ప్రసారం కానున్న ప్రత్యేక షోకు వ్యాఖ్యాతగా తారక్ వ్యవహరిస్తున్నారు. తాజాగా ఈ ప్రోగ్రామ్ ప్రోమో విడుదల కార్యక్రమం హైదరాబాద్‌లో జరిగింది.
ఈ సందర్భంగా పాత్రికేయులు.. ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఎప్పుడు వస్తారంటూ తారక్‌ను ప్రశ్నించారు. స్పందించిన తారక్.. 'ఈ ప్రశ్నను మీరు చాలా సందర్భాల్లో నన్ను అడిగారు. నేను చెప్పే సమాధానం ఏమిటో మీకు బాగా తెలుసు. '‘ఇది సమయం కాదు.. సందర్భమూ కాదు’'. తర్వాత తీరిగ్గా ఓరోజు కాఫీ తాగుతూ మనమే సరదాగా కబుర్లు చెప్పుకుందాం' అని స్పష్టం చేశారు.
కథానాయకుడిగా కంటే బుల్లితెరపై కనిపించడం వ్యక్తిగతంగా తనకెంతో ఆనందాన్ని ఇస్తుందన్నారు జూనియర్ ఎన్టీఆర్. స్టార్‌గా నలుగురితో కలిసి స్వేచ్ఛగా మాట్లాడే పరిమితి కోల్పోయిన తమకు బుల్లితెరపై కనిపించడం ఎంతో ఊరటనిస్తుందన్నారు. అలాగే తన అభిమానులెప్పుడూ కాలర్ ఎగరేసేలా ఉండటానికి తాను కష్టపడతానన్నారు. అభిమానులు ఏ పేరుతో పిలిచినా పలుకుతానని చమత్కరించారు యంగ్ టైగర్ ఎన్టీఆర్.
ఇవీచూడండి: ప్రేమతో ఎలా పిలిచినా పలుకుతా: తారక్